మెగా కెపాసిటీ తెలిపే క్యారెక్ట‌ర్ అదట !

 Posted October 24, 2016

dhruva movie know the ram charan capacity“నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే..నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది… నీ శ‌త్రువు ఎవ‌రో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది”.. అంటూ రాంచ‌ర‌ణ్‌ చెప్పిన డైలాగ్ తో యాభై సెకన్ల‌ ఈ టీజ‌ర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. రాంచరణ్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ చిత్రంలో చరణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌పించ‌నున్నారు.ఇందులో చెర్రీ నటన అద్భుతంగా ఉండబోతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ కెపాసిటీ ఎంటో నిరూపించనున్నాడట.

ధృవ ఆడియో విడుదలకి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.ఇక, సినిమాని డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ధృవ దసరాకి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కొన్ని కారణాల వల్ల అది కాస్త డిసెంబర్ కి వెళ్లింది.

SHARE