ధృవ మూవీ ప్రివ్యూ…

0
512
dhruva movie preview

Posted [relativedate]

dhruva movie previewచిత్రం : ధృవ (2016)
నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి
సంగీతం : హిప్ అప్
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్
రిలీజ్ డేట్ : 9 డిసెంబర్, 2016.

మెగా హీరో సినిమా వస్తుందంటే..ఆ క్రేజీయే వేరు.మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘ధృవ’ విషయంలో ఇంకాస్త ఎక్కువగానే ఉంది.తమిళ్ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’కి రిమేక్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఫస్ట్ లుక్ తోనే ‘ధృవ’పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ లలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ, సురేందర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్ అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాయి. ఇప్పుడంతా ‘ధృవ’కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపు (శుక్రవారం) ‘ధృవ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపు ‘ధృవ’ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

కథ.. ఇలా ఉండబోతోంది :

ఇప్పటికే తమిళ్ లో హిట్టైన కథ ‘ధృవ’.’తని ఒరువన్’ తమిళ్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొంది.కథలో పెద్దగా మార్పులేమీ చేయకుండా తెలుగు నేటివికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులని మాత్రమే చేశాం అని చెబుతున్నారు.దర్శకుడు సురేందర్ రెడ్డి. కొత్త లొకేషన్స్ లో షూటింగ్ చేశారట. చరణ్ పాత్రని మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నారంట. అందుకోసమే సిక్స్ ప్యాక్ బ్యాడీతో కనిపించబోతున్నారు. మాతృకలో హీరో-విలన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అవే కథకి ప్రధాన బలం కూడా. ధృవ విషయంలోనూ ఆ ఫీల్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డామని.. ఒరిజనల్ వర్షన్ కంటే
‘ధృవ’ ఇంకా బాగా వచ్చిందని చిత్రబృందం చెబుతోంది.

ఎక్స్ పెక్టేషన్స్.. ఇలా ఉన్నాయి :
‘ధృవ’పై చరణ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు.చరణ్ పై మెగా అభిమానులు అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకొన్నాడు. ఈ మధ్య కరువైన హిట్స్ కిక్కుని ‘ధృవ’ తో పొందాలని చరణ్ ఆశపడుతున్నాడు. ‘ధృవ’తో చరణ్ కి హిట్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ మొదటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఒకట్రెండు మెగాఫ్యాన్స్ ఒకట్రెండు ప్రత్యేక సమావేశాలని కూడా నిర్వహించుకొన్నారు.మరోవైపు, నిర్మాత అల్లు అరవింద్ చాకచక్యంగా ‘ధృవ’కి ఓ పక్షం రోజులు పోటీ లేకుండా చేశారు. ఇది ధృవకి కలిసొచ్చే అంశం. మొత్తానికి ధృవపై అంఛనాలు ఆకాశన్నంటాయి. ఇప్పటికే ఫస్ట్ రోజు టికెట్లు బుక్ అయిపోయాయి. చలికాలాన్ని కూడా లెక్కచేయకుండా మెగా అబిమానులు తెల్లవారు జామున షోకి టికెట్లు బుక్ చేసుకొని.. ధృవ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మెగా అభిమానులకి గుడ్ న్యూస్ :
‘ధృవ’ కోసం టికెట్ కొంటే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రాన్ని కూడా చూడొచ్చు.అదెలాగంటే.. ?ధృవ ప్రదర్శింపబడుతున్న థియేటర్స్ లో మెగా ఖైదీ ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారు. సో.. ఒకే టికెట్ పై రెండు సినిమాలు అన్నమాట.

Leave a Reply