ధృవ మూవీ రివ్యూ…

Posted December 9, 2016

dhruva movie reviewచిత్రం : ధృవ (2016)
నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి
సంగీతం : హిప్ అప్
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్
రిలీజ్ డేట్ : 9 డిసెంబర్, 2016.

మెగా హీరో సినిమా వస్తుందంటే..ఆ క్రేజీయే వేరు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘ధృవ’ విషయంలో ఇంకాస్త ఎక్కువగానే ఉంది.తమిళ్ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’కి రిమేక్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఫస్ట్ లుక్ తోనే ‘ధృవ’పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ లలో చరణ్ సిక్స్ ప్యాక్ బాడీ, సురేందర్ రెడ్డి స్టయిలీష్ టేకింగ్ అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాయి. ఇప్పుడంతా ‘ధృవ’కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. ‘ధృవ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరీ.. ప్రేక్షకుల అంచనాలని అందుకొన్నాడా.. ? మాతృక ఫ్లేఫర్ పట్టేశాడా..?? ఇంతకీ ‘ధృవ’ అసలు కథేంటీ.. ??? తెలుసుకునేందుకు రివ్యూలో వెళదాం పదండీ.. !

కథ :
ధృవ (రామ్ చరణ్) ఐపీఎస్ ట్రైనీ. ట్రైనింగ్ లో ఉండగానే స్నేహితులతో కలిసి క్రైమ్స్ ని అరికడుతుంటాడు. ఈ క్రమంలోనే పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు తప్పించుకుని బయట తిరుగుతుంటాడు. అదెలా జరిగింది తెలుసుకునే క్రమంలో ధృవ ఎన్నాళ్లగానో తను రీసెర్చ్ చేస్తున్న ఒక అంశానికి లింకు దొరికుతుంది. సిద్దార్థ అభిమన్యు (అరవింద స్వామి) అనే సైంటిస్ట్ తో ధృవకి గొడవ మొదలవుతుంది. ఇంతకీ సిధార్థ ఎవరు.. ? ధృవ – సిద్ధార్థల మధ్య జరిగే మైండే గేమ్ తో కూడిన యాక్షన్ నే మిగిలిన కథ. ఇందులో నెం.8 సస్పెన్స్ ఎంటన్నది కూడా ప్రధానమైనది. అదేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
* రాంచరణ్
* సినిమాటోగ్రఫీ
* నేపథ్య సంగీతం
* రకుల్ గ్లామర్
* ప్రొడక్షన్ వాల్యూస్

 మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్ లో స్లో నేరేషన్
* రన్ టైం

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
టెక్నికల్ గా ‘ధృవ’ సూపర్భ్ మూవీ. దర్శకుడు సురేందర్ రెడ్డి ‘తని ఒరువన్’ రిమేక్ విజయవంతంగా డీల్ చేశాడు. మాతృకలోని ఫ్లేవర్ మిస్ కాకుండానే.. తనదైన కోటింగ్ కొట్టాడు. ప్రత్యేకంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గురించి చెప్పుకోవాలి. చరణ్ నటన, స్టయిలీష్ లుక్స్ సూపర్భ్. ఇంతకు ముందు ఎప్పుడూ చరణ్ ని ఈ రేంజ్ లో చూసి ఉండరు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ బాడీని డెవలెప్ చేశాడు. సినిమాకెళ్లిన అమ్మాయిల లుక్స్ చరణ్ బాడీపై పడటం గ్యారెంటీ !. విలన్ గా అరవింద్ స్వామి స్టయిలీష్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. గతంలో హీరోగా అరవింద్ స్వామి మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు విలన్ కూడా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేశాడు. ‘ధృవ’ తర్వాత అరవింద్ స్వామి తెలుగులోనూ బిజీ అయిపోవడం ఖాయం.

ఇక, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాట్ హాట్ గా కనిపించి కనువిందు చేసింది. చరణ్ స్నేహితులుగా నటించిన బ్యాచ్ నటన చాలా బాగింది. మితిగా నటీనటులు వారి వారి పరిథిలో బాగానే నటించారు.

సాంకేతికంగా :
రాంచరణ్ ని న్యూ బ్రాండ్ లో చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే బాగుంది. మైండ్ గేమ్ నేపథ్యంలో సాగే సినిమాలకి స్క్రీన్ ప్లే అందించడం కష్టం. సురేందర్ రెడ్డి మాత్రం అదిరిపోయే స్క్రీన్ ప్లేని అందించారు. టెక్నికల్ గా ధృవ హై రేంజ్ మూవీ.సినిమాటోగ్రఫీ సూపర్భ్. నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రతి ఫేంలోనూ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కనిపిస్తోంది.ఇది మూవీ రేంజ్ ని పెంచేసింది. పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి ‘చూసా.. చూసా.. ‘, ధృవ టైటిల్ సాంగ్స్ బాగున్నాయి.ఎడిటింగ్ ఓకే. గీతా ఆర్ట్స్ అంటేనే ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్భ్ గా ఉంటాయి. ‘ధృవ’ విషయంలో ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
యాక్షన్ ఎంటర్ టైనర్ విషయంలో ఓ ప్లస్ పాయింట్ ఉంటుంది.మాస్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చే అవకాశం ఉంటుంది. ఇదే యాక్షన్ ఎంటర్ టైనర్ కి టెక్నకల్ వాల్యూస్,కాసింత సస్పెన్స్ ఎలిమెంట్స్ ని జోడిస్తే క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చు. ధృవ విషయంలో అదే జరిగింది.క్లాస్,మాస్ ప్రేక్షుకులని ఆకట్టుకొనే చిత్రమిది. మెగా అభిమానులు ధృవ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మిగితా ప్రేక్షకులు కూడా త్వరగా ధృవ థియేటర్స్ వైపు పరుగెత్తాల్సిన సినిమా.

బాటమ్ లైన్ : ధృవ.. ‘మైండ్ గేమ్’.. మైండ్ బ్లోయింగ్ !
రేటింగ్ : 3.25/5

SHARE