ధ్రువ ఈవెంట్ మమా అనిపించేయడమేనా..!

KTR Ready To Change His Fitness With Inspire Ram Charanమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఆడియో కూడా ఆన్ లైన్లో సింపుల్ గా రిలీజ్ చేసిన చరణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 4న గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశారు. కాని ఇప్పుడు ఆ ఫంక్షన్ కూడా మొక్కుబడిగానే కానిచ్చేయాలని చూస్తున్నారట. బ్రూస్ లీ తర్వాత సంవత్సరం గ్యాప్ తో వస్తున్న చరణ్ ధ్రువకు ముందునుండి భారీగా ప్రమోషన్స్ చేయాలని భావించాడు. కాని ఎక్కడ ప్లాన్ బెడిసి కొట్టిందో ఏమో కాని వచ్చే నెల 9న రానున్న ధ్రువ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు.

అయితే ఫ్యాన్స్ మాత్రం చెర్రి ట్రైలర్ కు పట్టం కట్టేశారు. ఏకంగా రిలీజ్ అయిన 5 గంటల్లోనే మిలియన్ మార్క్ టచ్ చేసేలా చేసి అదరహో అనిపించారు. ఇక ఈ ప్రయత్నంలో మెగా ఈవెంట్ అదేనండి ధ్రువ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఇక్కడ అని చెప్పి చివరకు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పెడుతున్నారు. ప్లేస్ పెద్దదే అయినా యూసఫ్ గూడా అంగానే సగం మందికి నీరసం వచ్చింది. అసలే ఇరుకు రోడ్లు అదికాక మెట్రో పనులతో ఆ రోడ్డంతా అస్థవ్యస్థంగా ఉంది.

మరి మెగా ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీ రేంజ్ లో వస్తారు ఆ తాకిడికి అక్కడ అంతా ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉంది. ఎలా అలోచించారో ఏమో కాని ప్రీ రిలీజ్ ఫంక్షన్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో చేయడం ఈవెంట్ ను ఏదో మమా అనిపించే కాన్సెప్ట్ లో భాగమే అని అంటున్నారు. మరి ఈవెంట్ ఎలా హిట్ అవుతుందో చూడాలి.