చంద్రబాబు,జగన్ …ఎవరి ఇల్లు ఎలా ఉంటుంది?

0
590
difference between jagan home and chandrababu home

Posted [relativedate]

difference between jagan home and chandrababu home
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నూతన గృహ ప్రవేశం చేసాక ఆ ఇంటి వైభోగం గురించి,పెట్టిన ఖర్చు గురించి విపక్ష వైసీపీ మాత్రమే కాదు సోషల్ మీడియా లోనూ విపరీతమైన ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు టీడీపీ కూడా ఎదురు దాడికి దిగుతోంది.జగన్ 2011 లోనే కట్టిన ఇళ్లతో పోల్చి బాబు ఇల్లు చాలా చిన్నదని చెప్పేస్తోంది.ఇందులో నిజానిజాలేమిటో ఆ రెండు ఇళ్ల గురించి సమాచారమున్న ఓ వీఐపీ ఇచ్చిన డీటెయిల్స్ ఇలా వున్నాయి ..

చంద్రబాబు ఇంటిలో ….

chandrababu home1 హైదరాబాద్,జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ .అరవై ఐదు లోని చంద్రబాబు ఇంటిలో కట్టడపు వైశాల్యం దాదాపు 20 వేల చదరపు అడుగులు.స్థలం 2410 చదరపు గజాలు
2 .చంద్రబాబు ఇంటిలో 8 పెద్ద పడక గదులు,విశాలమైన హాల్,కిచెన్,డైనింగ్,రీడింగ్ రూమ్ వున్నాయి.
3 .చంద్రబాబు ఇంటి నిర్మాణం,అలంకరణ సామాగ్రి,ఇతర ఫర్నిచర్ మొత్తం కలిపి అయిన ఖర్చు 10 కోట్లు
4 .చంద్రబాబు,లోకేష్ పేరిట బ్యాంకు అఫ్ బరోడాలో 7 కోట్ల లోన్ తీసుకున్నారు.
5 .బాబు ఇంటిలో లిఫ్ట్ వుంది గానీ నో ఎస్కేలేటర్,నో హెలి పాడ్,నో స్విమ్మింగ్ పూల్

జగన్ ఇంటిలో …

jagan home details1 . హైదరాబాద్ ,బంజారా హిల్స్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్ కట్టడపు వైశాల్యం దాదాపు 40 వేల చదరపు అడుగులు..స్థలం ఎకరం బాతిక
2 . లోటస్ పాండ్ లో దాదాపు 60 గదులున్నాయి.ఒక్కో గది వైశాల్యం సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంత ఉంటుంది.10 లిఫ్ట్స్,4 ఎస్కేలేటర్స్,2 మినీ థియేటర్స్ వున్నాయి.
3 .2011 లో లోటస్ పాండ్ నిర్మాణ ఖర్చు దాదాపు 100 కోట్లు పైమాటే
4 . ఇక బెంగళూరు లోని జగన్ ప్యాలస్ 32 ఎకరాల్లో నిర్మించారు.ఎయిర్ పోర్ట్ కి వెళ్లే దారిలో బాగలూర్ వద్ద ఉంటుంది.
5 .బెంగళూరు ప్యాలస్ ఖర్చు అప్పట్లో దాదాపు 300 కోట్లు .

Leave a Reply