Posted [relativedate]
ఆంధ్ర స్పెషల్ స్టేటస్ ఉద్యమం మరో సారి ఊపందుకోడానికి ముఖ్యకారణం తమిళులు చేసిన జల్లికట్లు నిరసన. తమిళులు చేసిన ఈ నిరసనతో అప్పటి వరకు చప్పగా ఉన్న ఏపి యువత ఒక్కసారిగా వేడెక్కి ప్రత్యేకహోదాకి నడుం బిగించింది.విశాఖ ఆర్కేబీచ్ లో మౌన దీక్ష ద్వారా కేంద్రం తలలు వంచేందుకు నిర్ణయించింది.ఈ మౌన దీక్షకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా లభించింది. జగన్, పవన్ కళ్యాణ్ వంటి నేతలతో పాటు పలువురు సినీ హీరోలు కూడా ఈ దీక్షకి మద్దతు తెలిపారు. మద్దతు మాత్రమే తెలిపారు. కానీ దీక్షలో పాల్గొనేందుకు ముందుకు రావడంలేదు.
కానీ జల్లికట్టు ఉద్యమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అనూహ్యమైన మద్దత్తు లభించడంతో పాటు రజినీకాంత్, అజిత్ వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొన్నారు. చివర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా, కేంద్రం తాత్కాలికంగా జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేసేంతవరకు శాంతియుత వాతావరణంలోనే ఉద్యమం చేశారు.
అయితే జల్లికట్టు నుండి స్ఫూర్తిని పొందిన స్పెషల్ స్టేటస్ ఉద్యమానికి మాత్రం టాలీవుడ్ తారలు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమయ్యారు.కారణం ఏంటి .? మౌన దీక్షనుకు టీడీపి, బిజేపి వ్యతిరేకిస్తున్నాయని, దీక్షను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం రెడీగా ఉందని, అది వారి ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి తెలుగు హీరోలు ముందుకు రావడంలేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ విషయంలో తెలంగాణా హీరో అయినా సంపూని అభినందించాలని అంటున్నారు. అన్ని విషయాలను పక్కకు పెట్టి ప్రత్యేక హోదా సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. లేకపోతే ఊహించినంత విజయం మాత్రం సాధించడం కష్టంమని అభిప్రాయపడుతున్నారు.