డిజిటల్ బేరం ముప్పా..మెప్పా..జాగ్రత్త

0
237
digital shopping is safe

Posted [relativedate]

digital shopping is safeనోట్ల రద్దు తర్వాత తెర మీదకి వచ్చిన తర్వాత ఈ పోస్ ,రూపే ,స్వీపింగ్ ఇలా పలు రకాల డిజిటల్ వాలెట్ లు అందుబటులోకి వచ్చాయి.ఐతే ఇది ఆహ్వానించతగ్గ పరిణామ మే అయ్యి నప్పటికీ మంచికి తగ్గ చెడు కూడా వుంది అనే చెప్పాలి.సెల్‌ఫోన్లలో ఆర్థిక లావాదేవీలపై సైబర్‌ దాడులు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని అసోచామ్ నివేదికలో తేలింది. ప్రస్తుత డిజిటల్‌ బాటలో 40 నుంచి 45 శాతం వరకూ ఆర్థిక లావాదేవీలు సెల్ ఫోన్ ల ద్వారానే జరుగుతున్నాయి ,

2017 లో ఇవి 60 నుంచి 65 శాతం వరకూ పెరగొచ్చని అంచనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నివేదికలోని అంశాలు ప్రకారం ‘సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలు’పేరిట అసోచాం-ఈవై సంయుక్తంగా దీన్ని విడుదలచేశాయి. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల మీద జరిగే సైబర్‌ దాడులు గత మూడేళ్లలో ఆరు రెట్లు పెరిగాయి

సురక్షిత అంతర్జాల వేదిక, నేరాలపై ప్రభుత్వ పర్యవేక్షణతో డిజిటల్‌ వాణిజ్యం మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉంటుంది కానీ డిజిటల్‌ ముప్పులను ఎదుర్కొనేందుకు మనం అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలేదు. కొన్ని దేశాలైతే పటిష్ఠమైన చర్యలతో ముందుకుసాగుతున్నాయి. మరోవైపు కొత్తకొత్త మాల్‌వేర్‌లు, వైరస్‌లూ పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడం పెను సవాల్‌గా మారుతోంది. దీన్నే మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటూ కేంద్రం ముందుకు అడుగులువేయాలని అసోచామ్ సూచిస్తోంది.

Leave a Reply