డిగ్గీ కి కాంగ్రెస్ బాధ..కాంగ్రెస్ కి డిగ్గీ బాధ వదిలినట్టే?

 Posted March 29, 2017

digvijay singh congress troubles
              ఓ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా …ఆపై కేంద్ర మంత్రిగా..అన్నిటికన్నా కాంగ్రెస్ అధిష్టానానికి తలలో నాలుకలా మెలిగిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు టెన్ జన్ పద్ కి కూరలో కరివేప అయ్యాడు.ఇటీవల గోవా,మణిపూర్ పరిణామాలతో రాజకీయాల్లో డిగ్గీ,ఆయన వ్యూహాలకు డేట్ ఎక్స్ పెయిర్ అయ్యిందని సోనియా,రాహుల్ గాంధీ కి కూడా అర్ధమైంది.ఏపీ విభజన టైం లో ఇదే విషయాన్ని ఇటు సమైక్య వాదులు,అటు తెలంగాణ వాదులు పదేపదే అధిష్టానానికి నివేదించినా ఫలితం లేకపోయింది.విభజన తర్వాత కెసిఆర్ బుట్టలోంచి జారిపోతున్నా పట్టనట్టు ఉండిపోయినందుకు ..ఇప్పుడు తెలంగాణాలో కూడా ఆ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. అటు ఏపీ లో చెప్పాల్సిన పని లేదు.ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయ్ కి సానుకూలత లేదని తెలిసి కూడా హైకమాండ్ ఆయన్నే ఇంచార్జి గా కొనసాగించింది.దీంతో ముఖ్యంగా ఏపీ లో ఆయన్ని చూడగానే విభజన ఎపిసోడ్ గుర్తుకు వచ్చి కాంగ్రెస్ మీద ఇంకాస్త కోపం పెరిగేది.ఇవన్నీ ఇప్పుడిప్పుడే హైకమాండ్ కి అర్ధమై డిగ్గీ కి ఇక కీలక బాధ్యతలు అప్పజెప్పకూడదని సోనియా,రాహుల్ డిసైడ్ అయ్యారంట.

       ఇదే విషయాన్ని సన్నిహితుడు ఒకరు దిగ్విజయ్ దగ్గర ప్రస్తావించి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడబోతే ఆయన అడ్డుపడ్డాడట.అదేమిటని అడిగితే కాంగ్రెస్ నన్ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తే నా నెత్తిన పాలుపోసినట్టే అని చెప్పాడట.రాహుల్ నాయకత్వంలో పని చేస్తూ కాంగ్రెస్ కి ఏ రాష్ట్రంలో అయినా విజయాలు సాధించడం కష్టమని తేల్చేశాడట.అందుకే సోనియా,రాహుల్ నోట ఎప్పుడు విడుదల వాఖ్యాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారట దిగ్విజయ్.ఈ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కి డిగ్గీ బాధ,డిగ్గీ కి కాంగ్రెస్ బాధ తప్పినట్టే వుంది.
          

SHARE