తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున కీలక పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ ఉరఫ్ డిగ్గీ రాజా మళ్లీ హైదరాబాద్ వచ్చారు.సంగారెడ్డిలో రాహుల్ సభ సన్నాహక ఏర్పాట్ల కోసం వచ్చిన రాజుగారు ఇక్కడి రాజకీయాల గురించి చాలానే మాట్లాడారు.కెసిఆర్ మీద విరుచుకు పడ్డ ఆయన టీడీపీ తో పొత్తు గురించి మాట దాటేసారు.ఈ విషయం మీద ఓకే అన్న జైపాల్ రెడ్డి ఏమన్నాడో తెలియదని తప్పుకున్నారు.ఇంకా గాంధీభవన్ లో దిగ్విజయ్ ఏమి అన్నారో చూద్దాం.
- ప్రభుత్వ భూములు .. అధికారుల అండ తో కబ్జా కు గురవుతున్నాయి…
- భూదాన్ భూములు ఏమయ్యాయి… మిగిలిన భూములు ఎక్కడున్నాయి ఎవరి చేతిలో ఉన్నాయి..
- మియాపూర్ భూ కుంభకోణం లో కూడా అదే కోవలో మాయం అయ్యాయి..
- సబ్ రిజిస్ట్రార్ బదిలీ చేశారు కానీ ముఖ్య నాయకులను వదిలేశారు..
- నయీమ్ కేస్ లో కూడా పోలీస్ ల మీద చర్య తీసుకుని రాజకీయ నాయకులను వదిలేశారు…
- భూ కుంభకోణం పై సీబీఐ విచారణ జరపాలి.. కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు..
- తలసాని శ్రీనివాస యాదవ్ ..భూ కుంభకోణం లో ఉన్నాడు..
- బహుశా కేసీఆర్, ఆయన కుటుంబానికి శ్రీనివాసయాదవ్ లాంటి వ్యక్తులు డబ్బుల వసూల్ కోసం అవసరం ఏమో..
- కాంగ్రెస్ హయం నుండి విచారణ జరిపినా మాకు అభ్యంతరం లేదు..
- కాంగ్రెస్ 2019 ఎన్నికలకు తయారు అవుతోంది.. అసెంబ్లీ సెగ్మెంట్స్ పై సూక్ష్మ పరిశీలన చేస్తున్నాం…
- అమిత్ షా పర్యటన కు మీడియా హైప్..ఇచ్చింది… అనేక చేరికలు ఉంటాయని ప్రచారం జరిగింది కానీ అంత తప్పని తేలింది..
- తెలంగాణ లో ముస్లిం ల కు వ్యతిరేకంగా హిందు కార్డ్ వాడి ..ఓట్ల polarisation చెయ్యాలని ప్రయత్నం బీజేపీ ది..
- మత తత్వ హిందూ, ముస్లిం సంస్థలతో బీజేపీ కు అవగాహన ఉంది…
- ఈ దేశం వివిధ వర్గాలు వాళ్లకి నచ్చిన ఫుడ్ తింటారు..అది రాష్ట్ర విషయం..
- బీజేపీ ప్రభుత్వ విధానం రైతుల కు వ్యతిరేకంగా ఉంది.. ప్రభుత్వం ..ప్రజలు ఎం తినాలి, ఎం చెయ్యాలి అని రూల్ పెట్టలేదు..
- బీజేపీ మంత్రి రిజుజు, నాగాలాండ్, మేఘాలయ నాయకులు బీఫ్ తింటామని వాళ్లే చెప్పారు..
- ఆంధ్ర లో టీడీపీ ని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ లో టీడీపీ irrilavent… జైపాల్ రెడ్డి స్టేట్మెంట్ నాకు తెల్వదు..
- 119 కి పోటీ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం
- పీఎం రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏకగ్రీవం కోసం ముందు చర్చకు రావాలి.. మేము పీఎం చర్చ కోసం ఎదురుచూస్తున్నాం.. అధికార పార్టీ ఏకగ్రీవం కోసం ముందుకు రావాలి..
- రిసర్వేషన్స్ వల్ల .. ముస్లిమ్స్ సంఖ్య పెరుగుతుందని ప్రచారం చేయడం వల్ల బీజేపీ లబ్ది పొందాలని ప్రయత్నం ..చేస్తోంది..