Posted [relativedate]
కాంగ్రెస్ పెద్దలతో జేఏసీ ఛైర్మన్ కోదండరాం టచ్ లో ఉన్నారా? తరచుగా ఢిల్లీ కాంగ్రెస్ నాయకులతో ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారా? కోదండరాంకు కాంగ్రెస్ అధిష్టానం గైడ్ చేస్తోందా? ఔననే సమాధానమే వస్తోంది.
ఇటీవల గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఈసందర్భంగా ఏపీ, తెలంగాణపై విమర్శలు చేస్తూ.. పరోక్షంగా కోదండరాం గురించి ప్రస్తావించారాయన. తెలంగాణ కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని పరోక్షంగా కోదండరాం కు మద్దతుగా మాట్లాడారు. డిగ్గీరాజా ఉన్నట్టుండి ప్రొఫెసర్ గారి నుంచి మాట్లాడడంతో .. ఆశ్చర్యపోవడం కాంగ్రెస్ నేతల వంతు అయ్యింది.
నిజానికి కోదండరాంపై కేసుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలే పెద్దగా నోరు విప్పరు. అలాంటిది ఢిల్లీ నుంచి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు .. కోదండరాం పేరు ఎత్తాల్సిన అవసరం ఏముంది.? పైగా కోదండరాం కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు. పోనీ ఏమన్నా పరిచయం ఉందా. అంటే అదీ లేదు. మరి కోదండరాం ప్రస్తావన ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కోదండరాం… కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని.. అందుకే దిగ్విజయ్ .. ప్రొఫెసర్ ప్రస్తావన తెచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రాజకీయమంటే ఢిల్లీ పెద్దలదే. సొంత పార్టీ నాయకులకు కూడా తెలియకుండానే వేరే వేదికకు చెందిన వ్యక్తితో సంప్రదింపులు జరపడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఇందులో నిజం ఉందా.. లేదా అన్నది కోదండరాం బయటకు చెబితే కానీ తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఎలాగూ ఈ విషయంలో నోరు విప్పరు. చెబితే ప్రొఫెసర్ గారే చెప్పాలి. ఆయన చెబితే గానీ ఇందులో క్లారిటీ రాదు!!! లేకపోతే అప్పటిదాకా ఈ ఊహాగానాలు ఇలా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. !!!