డిగ్గీ రాజా వస్తున్నాడహో..

 Posted October 31, 2016

digvijay singh will be coming to andhra pradesh
ఆంధ్ర ప్రదేశ్ లో ఎదురుదెబ్బలెన్ని తగిలినా కాంగ్రెస్ బుద్ధి మారలేదు.అదే వ్యూహాలు..అదే మనుషులు…కాంగ్రెస్ ని ఏపీ లో పాతాళంలో పూడ్చిపెట్టిన నేతలకే మళ్లీ కాంగ్రెస్ పైకి లేపే బాధ్యత అప్పజెప్పిందా ?పొడిచినవాడు వైద్యుడైనంతమాత్రాన కుట్లు వేసే బాధ్యత కూడా వారికే అప్పజెప్తారా ఎక్కడైనా? కానీ కాంగ్రెస్ అలాగే చేస్తోంది.అందులో తాజా అంకం డిగ్గీ రాజా అదే దిగ్విజయ్ సింగ్ గారు రెండు రోజుల రాష్ట్ర పర్యటన.ఈ పర్యటన ఉద్దేశం ఏపీ లో కాంగ్రెస్ ని పునరుజ్జీవింపచేయటం.ఆయన్ని చూడగానే విభజన పర్వంలో గాయపడ్డ పాత గాయం రేగుతుందన్న కనీస స్పృహ కూడా 10 జన్ పద్ కి లేకుండా పోయింది. సరే అక్కడెక్కడో కూర్చుంటారు వాళ్లకి క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియవనుకుందాం…ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన దిగ్విజయ్ కైనా తన్ను చూస్తే ఆంధ్రుల మనసులు బాధపడతాయని అర్ధం కావద్దు !

ఇటీవలే జైరాం రమేష్ కూడా తాను రాసిన పుస్తకంతో పాటు ఉండవల్లి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని పాత విషయాలు గెలికారు.ఆ రెండు పుస్తకాల వల్ల,వాటిలో వెల్లడైన విషయాల వల్ల కాంగ్రెస్ కి ఏమైనా మేలు జరిగిందా? పాత గాయాలు రేగడం తప్ప..జైరాం రమేష్ కెలికిన గాయంతో ఇప్పుడు కారం పూయబోతున్నారు దిగ్విజయ్ గారు..నిజంగా కాంగ్రెస్ ని బతికించాలనుకుంటే ఈ మొహాలు కాస్త మార్చండి ప్లీజ్ …

SHARE