ఆ సత్తా దిల్ రాజుకి ఉందా..?

0
357

Posted [relativedate]

dj1716బడా నిర్మాతగా కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజుకి తిరుగులేదు. అయితే దిల్ రాజు ప్రస్తుతం తీస్తున్న సినిమా శతమానం భవతి తన బ్యానర్లో వస్తున్న 25వ సినిమా కాబట్టి ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారట దిల్ రాజు. ఇప్పటి వరకు చేసిన 24 సినిమాల హీరోలు తన 25వ సినిమా శతమానం భవతి ఆడియోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మరి దిల్ రాజు హీరోలంటే స్టార్స్ అందరు ఉన్నట్టే మరి మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ వీరందరు దిల్ రాజు బ్యానర్లో నటించిన వారే. మరి అందరిని ఒకేవేదిక మీదకు తీసుకురాగలరా అన్నది ఇప్పుడు ముందున్న ప్రశ్న.

అవార్డ్ ఫంక్షన్స్ కే ఒక హీరో వస్తే మరో హీరో రాలేని పరిస్థితి అలాంటిది ఓ ఆడియోకి అందరు హీరోలు వస్తారా.. వచ్చినా వారి అభిమానులు చేసే అల్లరికి తట్టుకోగలుగుతారా అన్నది చూడాలి. ప్లాన్ బాగున్నా ఒక హీరో వచ్చి మరో హీరో రాకుంటే ప్రోగ్రాం డిస్ట్రబ్ అయినట్టే. టాప్ హీరోలందరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చే సత్తా దిల్ రాజుకి ఉందా లేదా అనంది శతమానం భవతి ఆడియో నాడు తెలుస్తుంది.

Leave a Reply