Posted [relativedate]
కొద్దిరోజులుగా నిర్మాత దిల్ రాజు మాస్ మహరాజ్ రవితేజల మధ్య డిస్టన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. తను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వనందుకే రవితేజ వేణు శ్రీరాం డైరక్షన్లో చేయాల్సిన దిల్ రాజు సినిమా చేయలేదని అన్నారు. అదే కాదు రవితేజ సినిమా అనుకోవడం ఆగిపోవడం దాదాపు సంవత్సరం నుండి ఇదే తంతు జరుగుతుంది. ప్రస్తుతం విహార యాత్రలన్ని ముగించుకుని వచ్చిన రవితేజ ఇక పర్ఫెక్ట్ గా సినిమాకు రెడీ అంటున్నాడట. ఇంత జరిగినా మళ్ళీ దిల్ రాజు బ్యానర్లోనే సినిమా చేస్తున్నట్టు టాక్.
రాజు రవితేజలను కలిపింది అనీల్ రావిపూడి అని తెలుస్తుంది. పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న ఈ యువ దర్శకుడు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేసి హిట్స్ అందుకున్నాడు. ఈమధ్యనే తారక్, బాలకృష్ణ లాంటి బడా హీరోలకు కథ చెప్పిన అనీల్ వారిని సాటిస్ఫై చేయలేదు. ఎన్.టి.ఆర్ తో సినిమా దాదాపు ఓకే అనుకున్నా కొత్త డైరక్టర్ తో రిస్క్ ఎందుకని వెనక్కి తగ్గాడని అంటున్నారు. ఇక ఆ తర్వాత రవితేజతో స్టోరీ డిస్కషన్స్ జరపడం ఓకే చేయడం అంతా జరిగింది.
బెంగాల్ టైగర్ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకుని రవితేజ చేస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉంటాయి. ఇక నిర్మాత ఎలాగు దిల్ రాజు కాబట్టి సినిమాలో విషయం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి. చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ చేసి త్వరగానే షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.