ఆ సినిమాలో దిల్ రాజు నటిస్తున్నారా?

0
304
dil raju play a role in sathamanam bhavathi movie

Posted [relativedate]

dil raju play a role in sathamanam bhavathi movie
దిల్ రాజు కి మంచి సినిమాలు తీయాలనే తపన ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్ గా విజయవంతమైన సినిమాల తో పాటు మంచి సినిమా అన్న పేరొస్తే అయన ఎక్కువగా సంతోషపడతారు. అందుకే ఈ తరంలోను తెలుగుదనం ఉట్టిపడే కధలు ఎంపిక చేసుకోవడంలో దిల్ రాజు ముందుంటారు. ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న శతమానంభవతి చిత్రం విషయంలో అయన ఎంతో ఉత్సాహంగా వున్నారు.బొమ్మరిల్లు అంత పేరు ఈ సినిమాకి వస్తుందని అయన నమ్ముతున్నారు.ఈ సినిమాని ప్రత్యేకంగా భావిస్తున్నారు.ఈ సినిమా నిర్మాతగానే కాకుండా అంతకు మించినదేదో చేయాలని దిల్ రాజు అనుకున్నారు.

శతమానంభవతి సినిమాలో కొద్దిసేపు దిల్ రాజు మెరవబోతున్నారట.ఆయనే ఈ నిర్ణయం,చొరవ తీసుకున్నట్టు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. అయితే అయన ఏదైనా పాత్ర చేశారా లేక కేవలం ఓ పాటలో అలా కనిపించారా అన్నది మాత్రం తెలియడం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ లో దేవుడి పల్లకి మోస్తూ హీరో శర్వా తో పాటు దిల్ రాజు కనిపించారు. అందుకే దిల్ రాజు ఈ సినిమాలో నటించడం గురించి చర్చ సాగుతోంది. ఇంతకు ముందు ఆడియో ఫంక్షన్స్ లో దిల్ రాజు వయసు,గ్లామర్ గురించి హీరోలు కామెంట్ చేసేవాళ్ళు.ఇప్పుడు అయన నటన కూడా మొదలెడితే సరదాగా ఆయన్ని మోసెయ్యడానికి చాలా మంది రెడీ గా వుంటారు.

[wpdevart_youtube]vk-vmZg5xOY[/wpdevart_youtube]

Leave a Reply