Posted [relativedate]
బడా నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఓ సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్నాడు. అదెలా అంటే దిల్ రాజు నిర్మిస్తున్న శతమానం భవతి సినిమా సతీష్ వేగేశ్న డైరక్షన్లో వస్తుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను మొదటి నుండి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు దిల్ రాజు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రాజు ఈ స్కెచ్ వేశాడు. అయితే ఈసారి సంక్రాంతి రేసులో రెండు భారీ సినిమాలు అవి కూడా మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత ఖైది నెంబర్ 150గా వస్తుంటే.. బాలయ్య బాబు శాతకర్ణితో దిగుతున్నాడు.
మరి ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. వీటికి పోటీగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతి కూడా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. చిరు, బాలయ్యలను తట్టుకోగలిగే శక్తి ఉందా అనడిగితే ఏ సినిమా జానర్ దానిదే. అందుకే తమ సినిమాను సంక్రాతికి రిలీజ్ ఫిక్స్ అనేస్తున్నాడు దిల్ రాజు.
చేతిలో ఎలాగు థియేటర్స్ భారీగానే ఉన్నాయి కాబట్టి దిల్ రాజు శతమానం భవతిని కూడా భారీగానే రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇదే కాకుండా అదే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఖైది నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకోవడం విశేషం.