ఆ టాప్ ప్రొడ్యూసర్ కు త్రివిక్రమ్ ఓకే అన్నాడు….పవన్ విషయం లో మాత్రం ఆ నిర్మాత నిరంతర ప్రయత్నాలు చేస్తున్నా అవి సక్సెస్ అవుతాయో లేదో నమ్మకంగా చెప్పలేకపోతున్నారు.ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు దిల్ రాజు …తమ బ్యానర్ లో చేసే సినిమాకు త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నాడని ఆయన చెప్పారు .అందులో హీరో ఎవరన్నది కథను బట్టి నిర్ణయిస్తామన్నారు.అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న కోరిక తీర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు దిల్ రాజు వివరించారు.అయితే ఆ సినిమా తీయగలనో ,లేదో మాత్రం కచ్చితంగా చెప్పలేక పోతున్నారు.పవన్ సినిమా మాటెలావున్నా దిల్ రాజు ఆధ్వర్యం లో మరో మెగా హీరో బన్నీ ఓ సినిమా కు ఓకే చెప్పేశారు.త్వరలో పట్టాల మీదకు రానున్న ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.