భావన కిడ్నాప్ విషయంలో నా ప్రమేయం లేదు: దిలీప్

0
459
Dileep Responds to Allegations on bhavana

Posted [relativedate]

Dileep Responds to Allegations on bhavanaమళయాళ హీరోయిన్ భావన కిడ్నాప్, లైగింక వేధింపులకు గురైందన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నుండి వినిపిస్తున్న మరో పేరు హీరో దిలీప్. కొంతకాలం క్రితం దిలీప్, భావనల మధ్య గొడవలు వచ్చాయని,  దీంతో దిలీప్.. భావనపై కక్ష కట్టి ఈ కిడ్నాప్ చేయించాడని మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ వార్తలపై హీరో దిలీప్ స్పందించాడు.

తనపై వస్తున్న ఆరోపణల గురించి ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చాడు. భావన ఘటన మలయాళ చిత్ర పరిశ్రమ సిగ్గుపడేలా చేసిందని, ఆ కేసులో నిందితులతో తనకు ఎలాంటి సంబంధాలూ లేవని  పేర్కొన్నాడు. ఇప్పటివరకు తనను ఏ పోలీసులు విచారించలేదని స్పష్టం చేశాడు. తనకి కుటుంబం ఉందని, కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉంటాయో తెలుసునన్నాడు. తనపై ఆరోపణలను ప్రసారం చేస్తున్న మీడియా వాటిల్లో ఒక్క దాన్నైనా   నిరూపించాలని సవాల్ చేశాడు.

Leave a Reply