‘ఇజం’ని గెలికిన దిల్ రాజు….

 Posted October 20, 2016

dill raju change ism movie scenes

టాలీవుడ్ లో టేస్ట్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన ఏదైనా సినిమాని టేకప్ చేశాడంటే అందులో మేటరు ఉన్నట్టే లెక్క. అందుకే చాలా మంది దర్శక-నిర్మాతలు సినిమా పూర్తయిన తర్వాత దిల్ రాజుకి చూపించి.. ఏమైనా మార్పులు చేర్పులు సూచించమని కోరుతారు.

కళ్యాణ్ రామ్ కూడా ‘పటాస్’ విషయంలో అదే చేశాడు. పటాస్ ని చూసిన దిల్ రాజు సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వడం ఖాయమని తేల్చిచెప్పారు. అంతేకాదు.. అప్పటికప్పుడే నైజాం రైట్స్ ని ఖరీదు చేసుకొన్నాడు కూడా. దిల్ రాజు చెప్పినట్టుగానే ‘పటాస్’ పేలింది.  చాన్నాళ్ల తరువాత కళ్యాణ్ రామ్ కి ఖాతాలో ఓ హిట్ పడింది.

తాజాగా, ‘ఇజం’ విషయంలోనూ కళ్యాణ్ రామ్ దిల్ రాజు సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు. ఇప్పటికే ‘ఇజం’ సినిమాని చూపించాడు. ఎప్పటిలాగే ఏమైనా మార్పులు, చేర్పులు సూచించాలని కోరాడు కళ్యాణ్. దీంతో.. ఒకట్రెండు సూచనలు చేశాడట. ఆ సూచనల మేరకు మార్పులు చేయడం కూడా జరిగిందట. ఆ మార్పులు ఏ మేరకు వర్కవుట్ అవుతాయన్నది చూడాలి మరి. ‘ఇజం’ రేపు (అక్టోబర్ 21)న ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE