ఈసారి సంక్రాంతికి ‘శ్రీనివాస కళ్యాణం’ చేయనున్న దిల్‌రాజు

0
533
dilraju srinivasa kalyanam for sankranthi

Posted [relativedate]

dilraju srinivasa kalyanam for sankranthi
గత సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ మరియు బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం విడుదలైనా కూడా తన సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ చిత్రాలకు పోటీగా ‘శతమానం భవతి’ చిత్రాన్ని విడుదల చేశాడు. అంత పోటీలో కూడా దిల్‌రాజు నమ్మకం నిలిచి ‘శతమానం భవతి’ చిత్రం ఘన విజయం సాధించింది. శర్వానంద్‌ కెరీర్‌లోనే ఎప్పుడు ఏ సినిమా సాధించని కలెక్షన్స్‌ను శతమానం భవతి సాధించి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడు సతీష్‌ వేగేశ్న అనే విషయం తెల్సిందే. ఆ దర్శకుడు గత కొన్నాళ్లుగా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్‌కు తాజాగా హీరో ఖరారయ్యాడు. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోగా నటించేందుకు కమిట్‌ అయ్యాడు.

మరోసారి పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రంగా ‘శ్రీనివాస కళ్యాణం’ను తెరకెక్కించి సంక్రాంతికి విడుదల చేయాలనేది దర్శకుడి ప్లాన్‌. అందుకు దిల్‌రాజు కూడా పూర్తి మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో సాయి శర్వానంద్‌కు ఘన విజయం దక్కింది. అలాగే ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో సాయిధరమ్‌ తేజ్‌కు కూడా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ దక్కుతుందేమో చూడాలి. ఇక ‘శ్రీనివాస కళ్యాణం’ పేరుతో చాలా సంవత్సరాల క్రితం వెంకటేష్‌ హీరోగా సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా దిల్‌రాజు ఈ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘జవాన్‌’ చిత్రం చేస్తున్న సాయిధరమ్‌ తేజ్‌ ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’లో పాలు పంచుకోనున్నాడు.

Leave a Reply