Saturday, December 4, 2021
Homelatest60 రోజులు చాలంటున్న దినకరన్

60 రోజులు చాలంటున్న దినకరన్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దినకరన్ కు బెయిల్ రాగానే తమిళనాడు పాలిటిక్స్ లో అలజడి మొదలైంది. ఇప్పటిదాకా పన్నీర్ వర్సెస్ పళనిగా సాగిన రాజకీయం. ఇప్పుడు దినకరన్ దెబ్బకు కొ్త్త టర్న్ తీసుకుంది. ఇప్పటిదాకా దినకరన్ అంటేనే ఆమడదూరం పారిపోయిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు . ఆయనకు బెయిల్ రాగానే చుట్టూ చేరి హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో మూడు ముక్కలాట ఎటు దారితీస్తుందో ఎవరికీ ఆర్థం కావడం లేదు.

బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లి శశికళను కలిసిన తర్వాత. దినకరన్ లో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేసింది. తనను చిన్నమ్మ తప్ప ఎవరూ తప్పించలేరని కుండబద్దలు కొట్టారు. దినకరన్ మాటలు చూస్తుంటే. శశి బాగానే బ్రెయిన్ వాష్ చేసినట్లు కనిపిస్తోంది. పార్టీని చేతిలో పెడితే. జైలుకు వెళ్లొచ్చావని, ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండమని స్ట్రాంగ్ డోస్ పడ్డట్లు తెలుస్తోంది. తాను ప్రాధాన్యత ఇచ్చి, జయకు పరిచయం చేసిన పన్నీర్, పళని లాంటి వాళ్లు కూడా సీఎం హోదాలో ఆలోచిస్తుంటే.. దినకరన్ మాత్రం ఇంతవరకూ పార్టీలో కుదురుకోలేదన్నది చిన్నమ్మ ఆగ్రహానికి కారణం.

దినకరన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటే అడ్రస్ లేకుండా పోతామని భయపడుతున్న శశికళ. ముందు పార్టీపై పట్టు పెంచుకోమని గట్టిగా చెప్పారట. అందుకే రెండు నెలల్లో సీన్ మారిపోతుందని కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు దినకరన్. గతంలో పార్టీ కోసం త్యాగాలకు సిద్ధమైన ఈయన. ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఎవరొచ్చినా కలుస్తానని చెబుతున్నారు. పళని క్యాబినెట్ లో మంత్రులకు కొన్ని చెప్పుకోలేని భయాలున్నాయని, అందుకే తనపై విమర్శలు చేస్తున్నారని దినకరన్ చేసిన వ్యాఖ్యలు. తమిళనాట హీటు పుట్టిస్తున్నాయి.

- Advertisment -
spot_img

Most Popular