అంతా ఆయనే చేశాడు

0
531
dinakaran is responsible for everything

Posted [relativedate]

dinakaran is responsible for everythingజయ మరణం తర్వాత పార్టీ చేజారిపోకుండా శశికళ చాలా కష్టపడ్డారు. కేంద్రం మద్దతు లేకున్నా మొండిగా పోరాడారు. చిన్నమ్మే రిసార్ట్ రాజకీయం నడపకపోతే.. పన్నీర్ ఇప్పటికీ సీఎంగానే ఉండేవారు. పళని మంత్రి పదవికే పరిమితం అయ్యారు. ఇక టీటీవీ దినకరన్ ఇంకా అజ్ఞాతంలోనే ఉండేవారు. కానీ అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు కదా. అందుకే చిన్నమ్మ జైలు పాలయ్యారు. టీటీవీ దినకరన్ తెరపైకి వచ్చారు. తన గైర్హాజరీలో పార్టీని, ప్రభుత్వాన్ని తన ఫ్యామిలీ చేజారకుండా కాపాడే బాధ్యత దినకరన్ చేతుల్లో పెట్టారు చిన్నమ్మ.

కానీ దినకరన్ ఏం చేశారు. రచ్చ రచ్చ చేశారు. తనతో పాటు చిన్నమ్మ పీఠం కిందకూ నీళ్లు తెచ్చారు. అసలు చిన్నమ్మ అనే పేరు తలవడానికే అన్నాడీఎంకే నేతలు భయపడేలా చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా రంగంలోకి దిగి తన పని తాను చేసుకోకుండా.. అనవసరంగా సీఎెం సహా మంత్రుల్ని ఇన్వాల్వ్ చేసి అందర్నీ ఇరికించేశారు. దీంతో ఇప్పుడు ఇష్టం లేకపోయినా పన్నీర్ డిమాండ్లకు తలఊపాల్సిన పరిస్థితిలో ఉన్నారు పళనిస్వామి. ఎక్కవ మాట్లాడితే ఆయన కూడా అరెస్ట్ కాక తప్పదనేది పళని భయం.

పార్టీలో సెల్వం పట్టు సాధించడానికి.. దినకరన్ దూకుడే కారణమని చిన్నమ్మ సన్నిహితులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడతో వెళ్లిన దినకరన్.. కనీసం సీఎంతో కూడా సమన్వయం చేసుకోలేదని, సీనియర్లను అవమానించారని ఆరోపిస్తున్నారు. అందుకే పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన దినకర్ ముఖం చూసేందుకు కూడా చిన్నమ్మ అంగీకరించలేదు. అందుకే చచ్చినట్లు పార్టీతో రాజీకి వచ్చారు దినకరన్. కానీ కష్టపడి, కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి తన వర్గం చేతుల్లోకి తెచ్చుకున్న పార్టీని.. పైసా ఖర్చు లేకుండా పన్నీర్ కు అప్పగించిన దినకరన్ పై శశికళ కోపం ఎప్పటికీ ఉంటుంది.

Leave a Reply