Tuesday, January 25, 2022
HomeEntertainmentCinema Latest‘బంగార్రాజు’ గురించి కొత్త కబురు

‘బంగార్రాజు’ గురించి కొత్త కబురు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగార్జున కెరీర్‌లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు ఆ చిత్రంలోని బంగార్రాజు పాత్ర కూడా మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో బంగార్రాజు పాత్రను కేంద్రంగా చేసుకుని ఒక సినిమాను చేయాలని నాగార్జున కోరుకున్నాడు. ఫ్యాన్స్‌ కూడా ఆ ప్రతిపాధనపై సంతోషంను వ్యక్తం చేశారు. ‘బంగార్రాజు’ టైటిల్‌ను కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జున రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. నాగార్జున ఎప్పుడెప్పుడు బంగార్రాజుగా కనిపిస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సోగ్గాడే.. ఫేం కళ్యాణ్‌ కృష్ణ తాజాగా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాన్ని తెరకెక్కించి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నాడు. దాంతో నాగార్జున స్వయంగా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణతో ‘బంగార్రాజు’ మొదలు పెట్టాల్సిందిగా చెప్పాడట.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌ టీంతో కలిసి దర్శకుడు ‘బంగార్రాజు’ కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. అయితే ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌ కథ అన్నట్లుగా ఉండటంతో పాటు, కథ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, మాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నట్లుగా ఉంటేనే సినిమా చేస్తాను అంటూ ముందే నాగార్జున చెప్పినట్లుగా తెలుస్తోంది. మూడు నెలల సమయం తీసుకుని మంచి కథను సిద్దం చేయాల్సిందిగా దర్శకుడిగా నాగార్జున సూచించాడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కథను సిద్దం చేయగలడా అనేది చూడాలి. నాగార్జునను ఆ దర్శకుడు బంగార్రాజు కథతో మెప్పిస్తాడా అనేది చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular