మోక్షజ్ఞ ఎంట్రీ.. డైరక్టర్ కన్ఫాం..!

0
1331
mokshagna

Posted [relativedate]

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫారిన్ లో నటనా శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సహ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. సినిమా మీద అవగాహన పెంచుకునే క్రమంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న మోక్షజ్ఞ ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అని తెలుస్తుంది.

ఈ నందమూరి వారసుడిని ఎవరు డైరక్షన్ చేస్తారు.. మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉండబోతుంది అన్న విషయాల మీద ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నాయి. అసలైతే బోయపాటి శ్రీను చేతిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కాని శాతకర్ణి సినిమాలో క్రిష్ దర్శకత్వ ప్రతిభ మెచ్చిన బాలకృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకుని క్రిష్ ద్వారా మోక్షజ్ఞను తెరంగేట్రం చేయిస్తున్నాడట.

క్రిష్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాని కచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పొచ్చు. శాతకర్ణి సినిమా సక్సెస్ అయితే మోక్షజ్ఞ క్రిష్ సినిమా కన్ఫాం అయినట్టే. మరి బాలయ్యతో హిత్ కొట్టి మోక్షజ్ఞ ఆఫర్ క్రిష్ కొట్టేస్తాడో లేదో చూడాలి.

Leave a Reply