ఎన్టీఆర్ దర్శకుడు అతనే కాని..!

Posted November 9, 2016

Director Confirmed For Ntr Next But Story Wasn'tయంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకట్లేదు. అందరి దర్శకులతో చర్చలు జరిపిన తారక్ ఫైనల్ గా అనీల్ రావిపూడికే తన ఓటేశాడని అంటున్నారు. పటాస్, సుప్రీం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనీల్ రావిపూడి జూనియర్ కు చెప్పిన కథ ఇదవరకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోసం రాసుకున్నదే అని డౌట్ మొదలైంది.

అందులో హీరో పాత్ర బ్లైండ్ గా ఉంటుందని అప్పట్లో హింట్ ఇచ్చాడు అనీల్. మరి ఇప్పుడు అదే కథతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడా ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ లో కొన్ని అంచనాలుంటాయి. మరి వాటికి తగ్గట్టు అనీల్ రావిపూడి తీయగలుగుతాడా లేడా.. అసలు రామ్ కు అనుకున్న కథతోనే తారక్ సినిమా చేస్తున్నారా అంటూ రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అనీల్ ఎన్టీఆర్ తో తీసే సినిమా రామ్ కు చెప్పిన కథ కాదని అంటున్నారు. కమర్షియల్ గా ఉంటూనే ఎంటర్టైన్మెంట్ మోడ్లో అనీల్ తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తున్నాయి. మరి తారక్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

SHARE