ఉల్లిపాయ కి మోడీ నిర్ణయానికి లింక్?

0
340
director deva katta tweet about 500 and 1000 rs notes changing process compared to modi onion

Posted [relativedate]

director deva katta tweet about 500 and 1000 rs notes changing process compared to modi onion
సృజనాత్మక హృదయాల స్పందన వేరుగా ఉంటుందేమో..మోడీ దెబ్బకి దేశమంతా నోట్ల కట్టల లెక్కల్లో మునిగి తేలుతుంటే ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం వెరైటీ గా స్పందించారు.లెక్కలేసుకుంటున్న జనాలు,బ్యాంకుల దగ్గర బారులు తీరిన ప్రజలు,బడా బాబుల కష్టాలు ఇవన్నీ ఆ దర్శకుడిని కదిలించలేదు.దేశ స్వతంత్ర పోరాటం తో పోల్చినా …చివరికి రేటు పెరిగినప్పుడు ఉల్లిపాయ సమస్యతో పోల్చినా ఇప్పుడు జనం ఇబ్బంది చిన్నదే అంటున్నాడు ఆ దర్శకుడు.ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదా …దేవా కట్టా

వెన్నెల,ప్రస్థానం వంటి లోతైన కథలతో జనాన్ని అలరించిన దేవా ఆ తర్వాత రేసులో కాస్త వెనుక పడ్డాడు.కమర్షియల్ సక్సెస్ అన్న మాట దేవా రూట్ కాస్త మారినట్టుంది.తనదైన బలాన్ని వదిలి బలహీనతను చాటుకోవద్దని తాత్త్విక విషయాలు సైతం సూటిగా,స్పష్టంగా చెప్పగలిగిన దేవా కి మనం గుర్తు చేయాల్సిన అవసరముందా?ఏమైనా మోడీ ఎపిసోడ్ లో కొత్త కోణాన్ని చూసిన దేవా అదే కళ్ళతో త్వరలో సరికొత్త ఆలోచనలతో ఓ దృశ్య కావ్యాన్ని అందిస్తాడని ఆశించడం తప్పు కాదేమో!

Compared to the inconvenience of a freedom struggle, onion crisis or any other natural calamity…this is nothing!! and it’s worth it!!

 

Leave a Reply