హీరోయిన్ ని అత్యాచారం చేసిన దర్శకుడు.. ఎవరు ?

Posted October 4, 2016

  director Selva Kannan Sex Harassment athira santhosh

సినీ పరిశ్రమలో దర్శక-నిర్మాతలు హీరోయిన్స్ ని వాడుకోవడం అనేది ఎప్పుడూ హాట్ న్యూసే. ఇలాంటి ఘటనలు తరచు వెలుగులోకి రావడం చూస్తున్నాం. తాజాగా, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి యవ్వారం బటపడింది. హీరోయిన్ అతిథి అలియాస్ అతిరా సంతోష్ పై తమిళ దర్శకుడు సెల్వ కన్నన్ అత్యాచారం చేశాడనే న్యూస్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అతిరా సంతోష్ ఆత్మహత్యకు యత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతిరా సంతోష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు
రంగంలోకి దిగారు. ద‌ర్శ‌కుడు సెల్వ క‌న్న‌న్ ను అరెస్ట్ చేశారు. ఈ దర్శకుడు వ్యవహారంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై మాయని మచ్చపడినట్టయింది.

ప్రస్తుతం తమిళంలో సెల్వ కన్నన్ దర్శకత్వంలో ”నేదునాల్ వాడై ” చిత్రంలో నటిస్తోంది అతిరా సంతోష్. అయితే, చిత్రీకరణ సమయంలో పలు మార్లు లైంగిక
దాడికి పాల్పడ్డాడ‌ని ఆమె ఆరోపించింది. ఈ ఘటన చలనచిత్ర పరిశ్రమ షాక్ కి గురిచేసింది.నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అతిథి ని ఆసుపత్రిలో పరామర్శించాడు. దర్శకుడు సెల్వ కన్నన్ ని కఠినంగా శిక్షించాలని సినీలోకం కోరుకుంటోంది.

SHARE