సారీ ఫర్ దట్: శంకర్

 Posted March 22, 2017

director shankar says sorry to media reporters in rome 2.0 setsరజనీకాంత్… శంకర్ ల‘రోబో 2.0’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్, టాలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ అంచానాలు ఉన్నాయి. కాగా ఐ మూవీ ఫ్లాప్‌ తరువాత మళ్లీ తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డ శంకర్‌..  2.o సినిమా విషయంలో అభిమానులు పెట్టుకున్న అంచనాలను నిలబెట్టేందుకు చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు.

కాగా ప్రస్తుతం తమిళనాడులోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి షూటింగ్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై  యూనిట్ బౌన్సర్లు దాడి చేశారు. దీనిపై ఆ ఇద్దరు ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో ఈ వివాదాన్ని అక్కడికే ఆపేందుకు రంగంలోకి దిగాడు దర్శకుడు శంకర్‌. జరిగిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానని, ఈ విషయాన్ని అంతటితో వదిలేయాలని తెలిపాడు.

SHARE