కిడ్స్ చానల్ లో వీకెండ్ సినిమాలు…

Posted February 4, 2017

discovery kids channel play a movies for kids to every week endingమొత్తం 2017 అంతటా వారాంతంలో సినిమాలు ప్రసారం చేయాలని డిస్కవరీ కిడ్స్ చానల్ నిర్ణయించింది. పిల్లలకు అభిమానపాత్రమైన భారతీయ పాత్రలతో ఉన్న చిత్రాలు ఈ చిత్రోత్సవాలలో భాగంగా ఉంటాయి. శక్తిమాన్, లవకుశ, హనుమాన్ , బార్బీ లాంటి పాత్రల చిత్రాలు ప్రసారమవుతాయి.

స్థానిక ప్రసారాంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో భారతదేశంలో సినిమాలు నిర్మించాలని కూడా డిస్కవరీ భావిస్తున్నట్టు డిస్కవరీ నెట్ వర్క్స్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ బక్షి ప్రకటించారు. వారమంతా అందించే కార్యక్రమాలకు భిన్నంగా వారం చివరిలో సినిమాలు ప్రసారం చేయటం సమంజసంగా ఉంటుందన్నారు.

పిల్లలకు సినిమాల ప్రసార కేంద్రంగా డిస్కవరీ కిడ్స్ చానల్ ను తీర్చి దిద్దటానికి మూవీ మెగాథాన్ చేపట్టినట్టు కూడా రాజీవ్ బక్షి వెల్లడించారు. ఎన్ బి సి యూనివర్సల్, రిలయెన్స్ మీడియా, కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ లాంటి సంస్థలతో డిస్కవరీ కిడ్స్ ప్రశంసలందుకుంది

SHARE