‘లోఫర్’ భామని పబ్లిక్ గా నలిపేశారు!

Posted October 14, 2016

 disha patani mobbed by fans jewellery shop opening hyderabadవరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటాని. ఈ చిత్రం ప్లాప్ కావడంతో టాలీవుడ్ లో మరెవ్వరూ దిశాని పలకరించలేదు. అయితే, ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన ధోని బయోపిక్ ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ దిశా మెరిసింది.

ఓ విజయంతో హైదరాబాద్ లో అడుగుపెట్టిన దిశా పటానికి ఘోర అవమానం జరిగింది. ఆమెని పబ్లిక్ గా నలిపేశారు. తాజాగా ఒక జ్యువెలరీ సంస్థ దిశాని తమ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కోసమని హైదరాబాద్ కు ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దిశా చాలా ఉత్సాహంగా విచ్చేసింది. పెద్దగా పాపులర్ కానీ హీరోయిన్ కావడంతో నిర్వాహకులు కూడా పెద్దగా సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడిదే కొంపముంచింది.

దిశాని చూసేందుకు కుర్రాళ్లంతా చుట్టుముట్టారు. అక్కడితో ఆగకుండా ఆమెని ఎక్కడెక్కడో గిల్లారట. వాళ్లందరినీ తప్పించుకుని వెళ్లే క్రమంలో దిశా అదుపు తప్పింది. ఆమె చేతికి గాయం కూడా అయిందట. ఇలా జరుగుతోందని ఊహించలేదు. ఇకపై హైదరాబాద్ ఎప్పుడొచ్చినా… ఫుల్ సెక్యూరిటీ వస్తానంటోంది ముద్దుగుమ్మ దిశా.

SHARE