Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు కొన్నే అయినా అందులో పలు చిత్రాలు అద్బుతాలుగా నిలిచాయి. పలు చిత్రాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తు పెట్టుకునేలా ఉన్నాయి అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పలు సినిమాలతో సూపర్ హిట్స్‌ను అందుకున్న దర్శకుడు వంశీ ఇప్పుడు ఈ జనరేషన్‌ను ఆకట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు విడుదల అవ్వడానికే ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్’ చిత్రం తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది.
30 సంవత్సరాల క్రితం ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ‘లేడీస్ టైర్’కు ఇది సీక్వెల్‌గా చెబుతున్నారు. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. సహజంగా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కాని ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లే కరువయ్యారు అంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఎలా ఉందో తెలియదు కాని, ఆ సినిమాను పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కాస్త వెనుకంజ వేస్తున్నారు. కారణం వంశీ గత చిత్రాలు. అయితే మధుర శ్రీధర్ తనకున్న పరిచయాలతో కొన్ని ఏరియాల్లో అమ్మేశాడు. అయితే కొన్ని ఏరియాల్లో అమ్ముడు పోకపోవడం వల్ల సొంతంగానే విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు. ఒక వేళ సినిమా ఫలితం తారు మారు అయితే నిర్మాత మధుర శ్రీధర్‌కు మతి పోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.