ఉగాది రోజున వైసీపీలోకి డీఎల్!!

0
675
dl ravindra reddy to join in ysrcp

Posted [relativedate]

dl ravindra reddy to join in ysrcp
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ చెంతకు వెళ్లేందుకు సర్వం సిద్ధమైపోయింది. మంతనాలు కూడా పూర్తయ్యాయి. ఇక లాంఛనమే మిగిలింది. పార్టీ కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలింది. అది కూడా త్వరలోనే అంటున్నారు వైసీపీ నేతలు.

గతంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన డీఎల్ రవీంద్రారెడ్డి మొదట వైఎస్ సన్నిహితుడిగా ముద్రపడ్డారు. 2004 లో ఆయనకు మినిస్ట్రీ రాకపోవడంతో కొంత గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ వైఎస్ కుటుంబంతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే 2014 ఎన్నికలకు ముందు ఎందుకనో డీఎల్ .. వైసీపీకి వెళ్లడం సాధ్యం కాలేదు. పైగా ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జగన్ కు డీఎల్ మద్దతు అవసరమైంది. దీంతో వైఎస్ వివేకా స్వయంగా డీఎల్ ఇంటికి వెళ్లి ఆయన సపోర్ట్ కోరారు. అంతేకాదు జగన్ కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడారట. దీంతో ఆయన కాదనలేకపోయారు. ఎంపీటీసీలుగా ఉన్న తన అనుచరులంతా వైసీపీ అభ్యర్థి వివేకాకు మద్దతిస్తారని ప్రకటించారు. అంతేకాదు ఆయన కూడా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

వైసీపీలోకి వెళ్లేందుకు మంచి ముహూర్తం కోసం డీఎల్ రవీంద్రారెడ్డి చూస్తున్నారు. ఉగాది రోజున మంచి ముహూర్తం ఉండడంతో వైసీపీ కండువా వేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అటు డీఎల్ వర్గం , ఇటు జగన్ సన్నిహితులు కూడా ఉగాది రోజున చేరిక ఖాయమేనంటున్నారు.

Leave a Reply