సెంటిమెంట్ పై డీఎంకే ఆశ‌లు!!

0
495
dmk leader stalin voice rise over the hindi sign boards on roads

 Posted [relativedate]

dmk leader stalin voice rise over the hindi sign boards on roads
భాషాభిమానంలో త‌మిళుల త‌ర్వాతే ఎవ‌రైనా. త‌మిళం జోలికి వ‌స్తే మాత్రం ఊరుకునేది లేదంటారు అక్క‌డి జ‌నాలు. స‌రిగ్గా ఇదే సెంటిమెంటును క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు డీఎంకే చీఫ్ స్టాలిన్. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో పెద్ద ప్లాన్ కే తెర తీశారాయ‌న‌.

ప్ర‌స్తుతం ఆర్కే న‌గ‌ర్ లో ఉదృతంగా ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారం చేస్తున్నాయి. అటు చిన్న‌మ్మ వ‌ర్గం ఇటు సెల్వం వ‌ర్గం మ‌ధ్య‌లో నేనున్నానంటూ దీప … ఇలా ఎవ‌రికి వారు దూకుడు పెంచారు. అస‌లే ఇది అన్నాడీఎంకే సీటు కావ‌డంతో ఇక్క‌డ డీఎంకే ప్ర‌చారానికి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. దీంతో ఆయ‌న త‌మిళ సెంటిమెంటును రాజేసే ప‌నిలో ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. హిందీ వ్య‌తిరేక గ‌ళాన్ని మొద‌లుపెట్టడం అందులో భాగ‌మేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మిళ‌నాడులోని వెల్లూరు, కృష్ణ‌గిరి జిల్లాల‌ జాతీయ ర‌హ‌దారుల్లో సైన్ పోస్టులు, మైన్ స్టోన్ లపై ఈ మ‌ధ్య హిందీ ప‌దాలు క‌నిపిస్తున్నాయి. హైవే మార్క‌ర్స్ పై ఇంగ్లీష్ స్థానంలో హిందీలో రాశారు. దీంతో ఎప్పుడు స‌రైనా ఇష్యూ దొరుకుతుందా? అని ఆలోచిస్తున్న డీఎంకేకు మంచి ఇష్యూ దొరికింది. అది కూడా త‌మిళ సెంటిమెంటుతో ముడిప‌డిన అంశం. ఇంకేముంది డీఎంకే చీఫ్ స్టాలిన్ దీనిపై గొంతెత్తారు. కేంద్రప్ర‌భుత్వం హిందీ, సంస్కృతం భాషల‌ను రాష్ట్రాల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఇంగ్లీష్ స్థానంలో హిందీలో రాయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. జాతీయ ర‌హ‌దారుల‌పై హిందీలో ఉన్న సైన్ బోర్డుల‌ను మార్చాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ దీనిపై స్పందించ‌క‌పోతే హిందీ వ్య‌తిరేక ఉద్య‌మాన్ని ప్రారంభిస్తామ‌ని మోడీ స‌ర్కార్ ను హెచ్చ‌రించారు.

హిందీకి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్త‌డం ద్వారా త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు స్టాలిన్. ముఖ్యంగా ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఈ పాయింట్ ను క్యాష్ చేసుకునేందుకు ప‌దేప‌దే ఈ అంశాన్ని లేవెనెత్తుతున్నారాయ‌న‌. మ‌రి ఈ హిందీ వ్య‌తిరేక గ‌ళం … డీఎంకేకు ఓట్లు రాల్చుతుందో లేదో చూడాలి!!!

Leave a Reply