రసాభాసగా మారిన సభ.. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

0
307
dmk mlas suspended by speaker from tamilnadu assembly

 Posted [relativedate]dmk mlas suspended by speaker from tamilnadu assembly

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ సందర్భంగా అసెంబ్లీలో యుద్ద వాతావరణం నెలకొనడంతో సభను వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఒంటిగంట తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. మార్షల్‌ రక్షణతో స్పీకర్‌ ధన్‌పాల్‌ సభను నిర్వహించారు.  వాయిదా తర్వాత ప్రారంభమైన సభలో  ఓటింగ్‌ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు  స్పీకర్ సన్నద్దమయ్యారు.

అయితే విపక్షాలు ఆందోళన చేస్తుండటంతో బలనిరూపణ మరోసారి రసాభాసగా మారింది. దీంతో స్పీకర్  సభనుంచి డిఎంకె సభ్యులను సస్పెండ్‌ చేశారు. మార్షల్స్‌ తో వారిని బలవంతంగా బైటికి పంపించసాగారు. అయినప్పటికీ సభ అదుపులోకి రాకపోవడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ధన్‌పాల్‌ ప్రకటించారు.  మరి ఈ సారైనా పళనిస్వామి బలనిరూణ సాఫీగా జరుగుతుందో లేదో.

Leave a Reply