Posted [relativedate]
అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత అదే చిరిగిన చొక్కాతో డీఎంకే నేత స్టాలిన్ రాజ్ భవన్ కి వెళ్లారు. అసెంబ్లీ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పళనిస్వామి వర్గం తమని కొట్టి తరిమేసిందని గవర్నర్ విద్యాసాగరరావు కి ఫిర్యాదు చేశారు.సోదరి కనిమొళి కూడా ఆయన వెన్నంటి వున్నారు. స్పీకర్ తన చొక్కా తానే చింపుకొని తమపై ఆరోపణలు చేస్తున్నారని స్టాలిన్ ఆవేదన చెందారు.
గవర్నర్ ని కలిసిన అనంతరం స్టాలిన్ నేరుగా మెరీనా బీచ్ వెళ్లి అక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షకి దిగారు.అయితే కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేసి తరలించారు.