డబ్బులిస్తే అన్నీ చూపించాలట!!

Posted December 28, 2016

do anything for money
రోజులు మారాయి. హీరోయిన్ల వేషధారణ మారింది. అంతవరకు ఓకే గానీ మోడ్రన్ డ్రెస్సుల సాకుతో కొందరు డైరెక్టర్లు .. హీరోయిన్లను బలవంతపెడుతున్నారు. నోటికొచ్చినట్టు దిగజారి మాట్లాడుతున్నారు. తాజాగా జనాలు డబ్బులిచ్చి థియేటర్లకు వచ్చినప్పుడు ఆమాత్రం చూపించాల్సిందే అన్నాడు ఓ దర్శకుడు. తమిళ డైరెక్టర్ సూరజ్ ఈ చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులు డబ్బులిచ్చి థియేటర్ కు వచ్చినప్పుడు .. హీరోయిన్లు ఆ మాత్రం చూపించాలి కదా.. అంటూ నోటికొచ్చినట్టు వాగాడు. ఒక ప్రెస్ మీట్ లో అతగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సూరజ్ వ్యాఖ్యలకు టాప్ హీరోయిన్ నయనతార స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తమను ఇష్టమొచ్చినట్టు చూపించడానికి హీరోయిన్లు వ్యభిచారిణులు కాదని మండిపడింది. కథానుగుణంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తామే తప్ప ప్రేక్షకులు కూడా తమ నుంచి అలాంటిదేమీ కోరుకోరని స్పష్టం చేసింది నయన్. సూరజ్ కుటుంబం నుంచి ఎవరైనా హీరోయిన్ అయ్యి ఉంటే అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తాడా అని కడిగి పారేసింది.

అటు మరో హీరోయిన్ తమన్నా కూడా అగ్గి మీద గుగ్గిలమైంది. తాము యాక్టర్లమని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఉన్నామని చెప్పింది. తమ్మూ 11 ఏళ్లుగా హీరోయిన్ గా పనిచేస్తోంది. తనకు ఏ కాస్ట్యూమ్స్ కంఫర్ట్ గా అనిపిస్తే వాటిని ధరిస్తుంది. అయినా మన దేశంలో ఆడవాళ్లపై అసభ్యంగా కామెంట్ చేయడం అలవాటైపోయిందని నిప్పులు చెరిగింది తమన్నా. అయినా హీరోయిన్ల విషయంలో సూరజ్ ఇంత దిగజారి మాట్లాడ్డంపై ఇండస్ట్రీలోనే కాదు బయటివ్యక్తులు కూడా మండిపడుతున్నారు.

SHARE