‘క్వీన్‌’కు తమన్నా సెట్‌ అయ్యేనా?

0
316
do tamanna set for queen movie

Posted [relativedate]

do tamanna set for queen movie
బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ చేసిన ‘క్వీన్‌’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా కంగనా రనౌత్‌కు పలు అవార్డులను తెచ్చి పెట్టింది. ఆ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేసేందుకు చాలా కాలం క్రితమే తమిళ నిర్మాత త్యాగరాజన్‌ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాడు. తెలుగు మరియు తమిళంలో ఒకే హీరోయిన్‌తో ఒకే సారి తెరకెక్కించేందుకు ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్‌తో ఈయన చర్చలు జరిపాడు. చివరకు ఆయన ప్రయత్నాలు తమన్నా వద్ద వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. తెలుగు మరియు తమిళంలో తమన్నాకు మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ తప్పకుండా ‘క్వీన్‌’ చిత్రానికి ఉపయోగడపతుందని ఆయన భావిస్తున్నాడు. అయితే తమన్నా ‘క్వీన్‌’ పాత్రకు సెట్‌ అవుతుందా అనే అనుమానాలకు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు తమన్నా ఒక్కటి అంటే ఒక్కటి కూడా నటన ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేసి నటిగా తనేంటో నిరూపించుకోలేక పోయింది. అయినా కూడా గ్లామర్‌తో కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. ఈమె చేసిన అన్ని సినిమాల్లో కూడా గ్లామర్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘క్వీన్‌ రీమేక్‌ అంటే ఖచ్చితంగా మంచి నటనను కనబర్చాల్సి ఉంటుంది. బాలీవుడ్‌లో కంగన రనౌత్‌ ‘క్వీన్‌’లో చేసిన నటనను ఖచ్చితంగా పోల్చి చూస్తారు. ఆ స్థాయిని ఈమె అందుకుంటుందా అనేది అనుమానమే. మరి త్యాగరాజన్‌ ఎందుకు తమన్నాను కోరుకుంటున్నాడు అనేది ఆయనే చూడాలి. తమన్నా క్వీన్‌గా చేసే ఆ చిత్రం ఆడటం కష్టమే అని మరి కొందరు ఇప్పటి నుండే అనుమానాలు పెడుతున్నారు.

Leave a Reply