మీడియాపై మండిపడుతున్న ట్రంప్..!!

75

Posted February 25, 2017, 3:07 pm

donald trump fires on mediaఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మీడియాపై నిప్పులు చెరిగారు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో  మీడియా తనపై కావాలనే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మరో అడుగు ముందుకేసి అమెరికాకు మీడియా పెనుముప్పుగా పరిణమించిందని విమర్శించడంతో పాటు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. వైట్ హౌస్ లో నిత్యం  జరిగే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లకు సీఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్‌  వంటి మీడియా సంస్ధల్ని అనుమతించకుండా నిషేధం విధించారు. 

అలాగే ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూంలో  ఆన్‌ కెమెరా సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఆఫ్‌ కెమెరా కెమెరా సమావేశం నిర్వహించారు. దీంతో ట్రంప్ తన ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారని, వైట్‌ హౌస్ సంప్రదాయాలను  కాలరాస్తున్న అమెరికన్ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇక కాన్సాస్ కాల్పులల్లో  మరణించిన కూచిభోట్ల శ్రీనివాస్ గురించి వ్యాఖ్యానించడానికి ట్రంప్ నిరాకరించారు.  తాను అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిననీ, ప్రపంచానికి కాదనీ, విదేశీ వలసదారుల గురించి తాను మాట్లాడనని  పేర్కొన్నారు. కాగా కాన్సాస్ కాల్పులకు డోనాల్డ్ ట్రంప్ విధానాలకూ ముడిపెట్టడం మంచిది కాదని వైట్ హౌస్ ప్రకటించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here