చెన్నై లో ట్రంప్ అభిమాని దోస….

Posted November 19, 2016

donald Trump White Dosaట్రంప్‌ గెలుపును ఎంతో సంబరంగా జరుపుకోవాలనుకున్న ఈ భారతీయుడు తన అభిమానమంతా రంగరించి ‘ట్రంప్‌ దోశ’ను తయారుచేశాడు.చెన్నై కి చెందిన సుప్రభా రెస్టారెంట్‌ యజమాని సి.పి.ముకుంద్‌కు ట్రంప్‌ అంటే విపరీతమైన అభిమానం. ట్రంప్‌ శైలి, మ్యానరిజం, ప్రసంగాలంటే ముకుంద్‌కు ఇష్టం. ఆయన గెలుపు వార్త వినగానే ఉబ్బితబ్బిబ్బై పోయిన ముకుంద్‌ ఆ సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ‘వైట్‌ దోశ’ను తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి అతడు పెట్టిన పేరే ‘ట్రంప్‌ దోశ.

trump dosaఈ దోశ ఆషామాషీగా తయారుచేయలేదు. అందుకతను చాలానే కష్టపడ్డాడు. తన కుమారులతో చర్చించాడు. దాదాపు 10-15 సార్లు వివిధ కాంబినేషన్లతో ప్రయోగాలు చేశాడు. చివరికి అందరికీ నచ్చే విధంగా దోశ వేయగలిగాడు. మయోన్నైజ్‌, ఇతర టాపింగ్‌లతో దానిని అలంకరించి వైట్‌ ట్రంప్‌ దోశను తన రెస్టారెంట్‌కు వచ్చిన వారికి సర్వ్‌ చేస్తున్నాడు. ఇంతకీ ముకుంద్‌ ట్రంప్‌ దోశను తెల్లగానే ఎందుకు చేశావంటే.. ‘ట్రంప్‌ కాకేషియన్‌ కాబట్టి’ అని సమాధానమిస్తున్నాడు

SHARE