డబుల్ బెడ్ రూంలకు వాస్తు దోషం!!

0
513
double bedroom vasthu dosham

Posted [relativedate]

double bedroom vasthu doshamసిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. సీఎం కేసీఆర్ లాంఛనంగా ఈ ఇళ్లను ప్రారంభించారు. గృహప్రవేశం ఓ రేంజ్ లో గ్రాండ్ గా జరిగింది. 580 మంది సొంతింటి కల నెరవేరింది. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే వేద మంత్రోచ్ఛారణల నడుమ కొత్త ఇళ్లలోకి ఇంటి యజమానులు అడుగుపెట్టారు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందంటూ వాసవి వాస్తు ప్లానర్స్ అధినేత ప్రకాష్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ కు వాస్తుపై నమ్మకం ఎక్కువ. అలాంటి ఆయన ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో వాస్తును ఫాలో కాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసీఆర్ కు సలహా ఇచ్చిన వాస్తు నిపుణులు సరైన గైడెన్స్ ఇవ్వలేదని టాక్. అందుకే ఇలా జరిగిందని చెప్పుకుంటున్నారు.
ఈ వాస్తు దోషం వార్తలతో ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజల్లో అప్పుడే భయాందోళనలు మొదలయ్యాయట. లేకలేక సొంతింట్లోకి వస్తే ఈ వాస్తు లొల్లి ఏంటని ఆందోళన చెందుతున్నారట. దీంతో ఎవరికి వారు వాస్తు స్పెషలిస్టులను సంప్రదించే పనిలో ఉన్నారని టాక్. అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం అలాంటి వాస్తు దోషం ఏదీ లేదని .. ఇదంతా ట్రాష్ అని చెబుతున్నారు

Leave a Reply