రెజీనా క్రేజ్ తగ్గుతుందా..?

    down rejina craze

రెజీనాతో పని చేసిన ప్రతి హీరో.. ప్రతి దర్శకుడూ ఆమెను పొగుడుతారు. ఆమె టాలెంట్ గురించి గొప్పగా చెబుతారు. ఆమె సినిమాల ఆడియో వేడుకలకు వచ్చే పెద్ద హీరోలు, దర్శకులు కూడా ఆమె మీద ప్రశంసలు కురిపిస్తారు. కానీ ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశం మాత్రం దక్కదు. అందం, అభినయం రెండూ ఉన్నా సరే.. మీడియం రేంజి హీరోలు, మీడియం రేంజి సినిమాలకే పరిమితం అయిపోతోంది రెజీనా. ఐతే మొన్నటిదాకా గోపీచంద్, మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్ లాంటి కొంచెం ఇమేజ్ ఉన్న మీడియం రేంజి హీరోలతో అయినా చేస్తూ వచ్చింది కానీ.. వరుసగా రెండు ఫ్లాపులు పడేసరికి క్రమ క్రమంగా ఆమె స్థాయి మరింత పడిపోతున్నట్లుగా ఉంది.

ప్రస్తుతం జ్యో అచ్యుతానందలో నటిస్తోంది రెజీనా. అందులో హీరోలుగా నటిస్తున్న నారా రోహిత్, నాగశౌర్యలిద్దరూ ఇమేజ్ లేని హీరోలే. దీని తర్వాత అవసరాల శ్రీనివాస్ లాంటి కమెడియన్‌తో జత కట్టబోతోంది రెజీనా. వీళ్లిద్దరి కాంబినేషన్లో బాలీవుడ్ అడల్ట్ కామెడీ హంటర్ రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. రెజీనా మెచ్యూర్డ్‌గా ఆలోచించి ఒప్పుకుని ఉండొచ్చు కానీ.. ఈ సినిమా చేయడం ద్వారా పెద్ద సినిమాలకు ఆమె మరింత దూరం అయిపోతుందనడంలో సందేహం లేదు. మరోవైపు తమిళంలో ఎస్.జె.సూర్య సరసన నటిస్తోందామె. హీరోగా అతడి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక లేటెస్టుగా కమెడియన్ టర్న్డ హీరో సంతానంతో ఓ సినిమాకు ఓకే చెప్పింది. మొత్తంగా ప్రస్తుతం రెజీనా చేతిలో ఉన్నవన్నీ కూడా చిన్న సినిమాలే. అందులోని హీరోలెవ్వరికీ ఇమేజ్ లేదు. దీంతో ఇకముందూ ఇలాంటి ప్రాజెక్టులే ఆమె తలుపు తట్టే అవకాశముంది. స్టార్ హీరోల పక్కన చేయాలని చాలా కోరికతో ఉన్న రెజీనా.. ఇకపై ఆ ఆశను పూర్తిగా పక్కనబెట్టేయాల్సిందే అన్నమాట

SHARE