పుష్కర ఘాట్లపై ఆకాశ నేత్రాలు

0
475

 drone cameras pushkaralu

కృష్ణా పుష్కరాల నిర్వహణలో డ్రోన్‌లు కూడా పాలుపంచు కుం టున్నా యి. యాత్రికులకు సులభం గా ఘాట్ల వివరాలపై సూచ నలు చేయడానికి, స్నానం చేయడానికి డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడు తున్నాయి. డ్రోన్‌ల సాయం త్రంతో పుష్కరాలను నిర్వహిస్తున్న ప్రదేశాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

గత ఏడాది గోదావరి పుష్కరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ పర్యవేక్షణ మంచి ఫలితాలు ఇవ్వడంతో కృష్ణా పుష్కరాలలోనూ నిర్వహిస్తున్నారు. ఒకసారి డ్రోన్‌ని ప్రయోగించడానికి పది నిమిషాలు పడుతుంది. పోలీసు శాఖ వద్ద ప్రయోగించడానికి మొత్తం 18 డ్రోన్లలో 12 డ్రోన్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించడానికి ఘాట్లలో రెండీగా ఉంటారు. డ్రోన్ ఒకసారి పైకి వెళ్లాక 20 నుంచి 30 నిమిషాల ఫీడ్ వస్తుంది. డ్రోన్ కెమేరా కూడా రొటేట్ అవుతుంది. డ్రోన్ కెమేరాల ద్వారా ప్రధాన ఘాట్లతో పాటు రద్దీ ప్రదేశాలను చిత్రీకరించి ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు వీక్షిస్తున్నారు.

ఆయా ఘాట్లలో భక్తుల రద్దీ నియంత్రణకి, ట్రాఫిక్ నియం త్రణలపై ఆయా అధికారులు దిగువ స్థాయి అధికారులకు సిబ్బందికి ఎప్పటి కప్పుడు సూచనలు చేయడం వల్ల పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడానికి డ్రోన్ కెమేరాలు ఎంతగానో దోహదపడు తున్నాయి.

Leave a Reply