ఆ పిల్లాడిలోనాన్నని చూసుకుంటున్న దేవీ..

0
367
dsp father reborn as his nephew

Posted [relativedate]

dsp father reborn as his nephew
తండ్రీబిడ్డల అనుబంధం ఎంత గొప్పదో వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ కొన్ని బంధాలు ఇంకాస్త ఎక్స్ట్రా ఆర్డినరీ అనిపిస్తాయి.అలాంటి స్పెషల్ కేసుల్లో ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ,అయన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తిది.హార్ట్ పేషెంట్ అయిన సత్యమూర్తి,దేవీల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ గురించి నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో వేడుకలో అందరికీ తెలిసింది.తండ్రిని పోగొట్టుకున్న దేవీ అయన గురించి మాట్లాడిన మాటలు ఎందరినో కదిలించాయి.ఇప్పుడు దేవీకి ఆ లోటు తెలియడం లేదట.తండ్రే ఓ చంటి బిడ్డగా మళ్లీ తమ ఇంటిలోకి అడుగు పెట్టాడని సంబరపడిపోతున్నారు.దేవీ సోదరికి కొడుకు పుట్టాడు.ఆ చంటి పిల్లాడు సాక్షాత్తు తమ తండ్రేనని అనుకుంటున్న దేవీ కుటుంబం ఆ చిన్నారికి తండ్రి పేరే పెట్టుకున్నారు …తనవ్ సత్య అని .ఆ పిలాడిని తన తండ్రిగా పేర్కొంటూ పేస్ బుక్ పేజీ లో దేవీ పెట్టిన ఫోటో చూస్తుంటే…దేవీ కి తండ్రిలేని లోటు నిజంగా పూడిపోయిందనిపిస్తోంది.

Leave a Reply