దునియా తో ఎన్టీఆర్ ఫైట్…

Posted April 6, 2017

duniya vijay in ntr jai lava kusa movie
జైలవకుశ తో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్న ఎన్టీఆర్,ఎన్టీఆర్ ఆర్ట్స్ విలన్ విషయం లోనూ అలాంటి స్టెప్ తీసుకుంది.వివాదాల మీద వివాదాలు సృష్టించుకుని కన్నడ చిత్ర సీమ నుంచి నిషేధానికి గురి అయిన దునియా విజయ్ ని సీన్ లోకి దించింది.ఇతన్ని మీరు తేలిగ్గా గుర్తు పట్టాలంటే ఓ విషయం ప్రస్తావించాలి.ఇటీవల ఓ కన్నడ సినిమా షూటింగ్ లో హెలికాప్టర్ నుంచి ఓ రెజర్వాయర్ లోకి దూకిన షాట్ లో ఇద్దరు ఫైటర్స్ చనిపోయారు గుర్తుందా ? వారితో పాటు దూకి ఆ గండం నుంచి బయటపడి ఈదుకుంటూ వచ్చినవాడే ఈ దునియా విజయ్.

జూనియర్ ఆర్టిస్ట్ గా కన్నడ చిత్రసీమలోకి వచ్చిన విజయ్ తర్వాత మెయిన్ విలన్ గా ఎదిగాడు.ఆపై హీరోగానూ కొన్ని సినిమాలు చేసాడు.సెట్ లో ఎవరో ఒకరిని కొట్టి అరెస్ట్ అయిన సందర్భాలు కూడా వున్నాయి.ఇక ఆ హెలికాప్టర్ ఎపిసోడ్ తో ఈయన మీద కన్నడ చిత్ర సీమ బ్యాన్ పెట్టింది.అయినా పెద్దగా సానుభూతి రాలేదు.అదీ …దునియా విజయ్ క్యారెక్టర్.అక్కడ దార్లు మూసుకుపోవడంతో వేరే ప్రయత్నాలు మొదలెట్టాడు.చివరికి ఇలా ఎన్టీఆర్ ఫిలిం లో ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ లో అడుగు పెట్టాడు.జైలవకుశ లో ఇతను కీలక పాత్రలో నటించబోతున్నాడు.విలన్ గా ఎన్టీఆర్ తో ఫైట్ చేయబోతున్నాడు.

SHARE