Posted [relativedate]
అల్లు అర్జున్ నటిస్తున్నదువ్వాడ జగన్నాధమ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాను మే6న విడుదల చేయాలని భావించిన చిత్రయూనిట్ అందుకు సంబంధించిన పనులన్నింటినీ చకచకా చక్కబెట్టేస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాత డీజే రిలీజ్ ని వాయిదా వేశాడని తెలుస్తోంది. అందుకు కారణం బాహుబలి-2 సినిమానే.
రెండు రోజుల క్రితం విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ సోషల్ మీడియాలో సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. ఆ సునామీలో టాలీవుడ్ రికార్డులతో పాటు బాలీవుడ్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. కేవలం రెండున్నర నిమిషాల ట్రైలరే ఇంత హంగామా చేస్తే ఇక సినిమా ఇంకేన్ని ప్రకపంనాలు సృష్టిస్తుందోనని దిల్ రాజు వర్రీ అవుతున్నాడట. ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ , రెస్పాన్స్ చూసి రాజు ఆలోచనలో పడ్డాడట. ముందుగా మే6న అంటే బాహుబలి విడుదలైన వారం రోజులకి డీజేని విడుదల చేద్దామనుకున్నా, ఇప్పుడు మాత్రం ఒక నెల రోజులు ఆగితే బెటర్ అని అనుకుంటున్నాడట. నెల రోజుల తర్వాతైనా బాహుబలి క్రేజ్ తగ్గుతుందో లేదో… మొత్తానికి బాహుబలిని చూసి భళ్లాలదేవనే కాదు మిగిలిన సినిమాలు కూడా దడుచుకుంటున్నాయన్నమాట.