Tuesday, June 28, 2022
HomeEntertainmentCinema Latestదిల్‌రాజుది కక్కుర్తి అంటున్న బన్నీ ఫ్యాన్స్‌

దిల్‌రాజుది కక్కుర్తి అంటున్న బన్నీ ఫ్యాన్స్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్స్‌తో ఫ్యాన్స్‌ పిచ్చెకి పోతున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. ఇక చిత్రం ఆడియో వేడుకను ఈనెల 11న అంటే రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యాన్స్‌ భారీగా హాజరు కావాలని కోరుకుంటున్నారు. కాని దిల్‌రాజు ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు పోస్తున్నాడు.

దిల్‌రాజు ‘డీజే’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను శిల్ప కళావేదికలో నిర్వహించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం పెద్ద వేడుకలు అన్ని కూడా కన్వెన్షన్‌లలో జరుగుతున్నాయి. అక్కడ భారీగా జనాలు వెళ్లేందుకు అవకాశం ఉటుంది. కాని శిల్పకళా వేధికలో మాత్రం చాలా తక్కువ పరిధిలోనే జనాలు పడతారు. అయితే అక్కడ కన్వెన్షన్‌లలో అయితే భారీగా రేటు చెల్లించాల్సి ఉంటుంది. అదే శిల్పకళావేదికలో అయితే వేలలోనే రెంట్‌ ఉంటుందనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు అక్కడ వేడుక ఏర్పాటు చేశాడు. దాంతో అభిమానులు దిల్‌రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ‘డీజే’ను నిర్మించి ఇలా చిన్న విషయానికి కక్కుర్తి పడడు అని, శ్పికళావేదిక ఆయనకు సెంటిమెంట్‌ అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

- Advertisment -
spot_img

Most Popular