Posted [relativedate]
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని సరసన కీర్తి సురేష్ జతకట్టనుంది. ‘డీజే’లో బన్ని ద్విపాత్రాభినయం చేయనున్నాడు. బ్రాహ్మణ పాత్రలో విపరీతంగా నవ్విస్తాడట. ఈ పాత్ర బాగా పండేందుకు బన్ని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంటున్నాడు. టెక్నికల్ గా ‘డీజే’ రిచ్ గా ఉండబోతుందట. ఇందుకోసం బాలీవుడ్ టెక్నీషియన్‌ను తీసుకున్నారు. చక్ దే ఇండియా, గుజారీష్.. చిత్రాలకి సినిమాటోగ్రాఫర్ సుదీప్ డీజే కోసం పనిచేయనున్నారు. సెట్స్ పైకి వెళ్లక ముందే డీజే పై భారీ అంచనాలు పెరిగాయ్. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం అన్ని అంశాలని పక్కగా ప్లాన్ చేసుకొంటోంది. ఈ చిత్రం ఈ నెల 21 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.