ద్వారక రివ్యూ

Posted [relativedate]

dwaraka movie reviewచిత్రం: ద్వారక 

తారాగణం: విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరీ,  ప్రకాశ్‌ రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీరాజ్‌  
సంగీతం: సాయికార్తీక్‌ 

ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు

నిర్మాణం: లెజెండ్‌ సినిమా 

నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు
దర్శకుడు: శ్రీనివాస్‌ రవీంద్ర 

విడుదల తేదీ:3-3-17

లాజిక్స్  కంటే మ్యాజిక్స్ నే ఎక్కువ నమ్ముతారు.. అందుకే మన దేశంలో బాబాలు ఫేమస్ అని జులాయి సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ గుర్తింది కదూ. సరిగ్గా ఈ పాయింట్ నే బేస్ చేసుకుని సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ యంగ్ హీరో  నటించిన తాజా చిత్రం ద్వారక. ఈ సినిమాలో దొంగబాబాగా మేజిక్కులు చేస్తుంటాడు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన  ఈ దొంగబాబా తన మేజిక్ తో ప్రేక్షకుల్ని కూడా మెప్పించగలిగాడా… పెళ్లి చూపులు సినిమా తరహా సెన్సేషన్ ని మరోసారి క్రియేట్ చేశాడా అనేది తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కధ ఏంటంటే:

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఎర్రశీనుగా నటించాడు.

ఎర్రశీను స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ రోజు స్థానికులు వెంబడించడంతో ద్వారక అనే అపార్ట్‌ మెంట్‌ లో తలదాచుకుంటాడు.  అక్కడ అనూహ్య సంఘటనలతో   ఎర్రశీను  బాబాగా మారతాడు. తనకొచ్చిన చిన్నచిన్న మ్యాజిక్స్ తో జనాల్ని బుట్టలో వేస్తాడు. భక్తుల రాకపోకలు, పూజలు, కానుకలు,  సోషల్ మీడియా పబ్లిసిటీ.. ఇంకేముంది తక్కువ సమయంలోనే చాలా  పాపులర్‌ అయిపోతాడు. ఈ బాబా అవతారాన్ని ఇలానే కంటిన్యూ చేసి కోట్లకు పడగెత్తాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ బాబాకి పూజా అనే అమ్మాయితో  పరిచయం అవుతుంది.  అది ప్రేమగా మారుతుంది. మరోపక్క ఈ బాబాను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన రూ.2వేల కోట్లను కొట్టేయాలని  ఒక ముఠా ప్రయత్నిస్తుంటుంది. అలానే ఎర్రశీను  బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు వస్తాడు. అన్ని వైపుల నుండి సమస్యలు చుట్టుముట్టే సరికి ఎర్రశీను ఇబ్బందుల్లో పడతాడు. ఈ సమస్యల  నుండి  ఎర్రశీను ఎలా బయటపడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడా..? బాబా నాటకానికి ఎలా తెరదించాడు అనే ఆసక్తికర అంశాలు తెలుసుకోవానుకుంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

కధనం ఏంటంటే..

కధ పాతదే అయినా కథనం కొత్తది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, రొమాంటిక్ ట్రాక్ లతో సరదాగా సాగిపోతుంది. హీరో దొంగబాబాగా మారిన తర్వాత సినిమా చాలా ఫన్నీగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ షాకింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ ధ్రిల్లింగ్ గా ఉన్నా కాస్త స్లో గా అనిపిస్తుంది. హీరో, అతని బ్యాచ్ ప్రమాదంలో చిక్కుకోవడం, దాన్నుంచి బయటపడడం కోసం వారు చేసే ప్రయత్నాలు అలరిస్తాయి.

ఎవరు ఎలా చేశారంటే…

విజయ దేవరకొండ నటన పరంగా చాలా ఇంప్రూమెంట్ చూపించాడు. దొంగగా, దొంగబాబాగా .. రెండు వేరియేషన్స్ చూపించగలిగాడు. కామెడీ కూడా పండించగలిగాడు. పూజా జవేరి గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితమయ్యింది. పృధ్వీ తెరమీద నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రకాశ్‌రాజ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్ర  కథలో కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు పాత కధనే ఎంచుకున్నా ట్రీట్ మెంట్ తో నడిపించగలిగాడు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు ఇంకాస్త బాగుండాల్సింది.

ప్లస్ పాయింట్స్..  

స్క్రీన్ ప్లే

వినోదం 
దొంగబాబా లీలలు

మైనస్ పాయింట్స్…

పాటలు

సెకండాఫ్ సాగదీత

ఆఖరిపంచ్: ఓకే అనిపించుకున్న ద్వారక

Telugu Bullet Rating: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here