విండీస్ క్రికెటర్ తో శ్రియ ఎఫైర్.. ఇదిగో రుజువు !

Posted October 13, 2016

 dwayne bravo shriya secret affair

వయసు పెరిగినా.. వన్నె తగ్గని భామ శ్రియ. 30+లోనూ స్టార్ హీరోలతో జతకట్టే అందాలని మెంటైన్ చేస్తోంది.అయితే, ఇప్పుడీ ముద్దుగుమ్మ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రోవోతో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రావో తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తున్న శ్రియ ఫోటోలు బయటికొచ్చాయి. దీంతో.. బ్రావోతో శ్రియ లవ్ ఎఫైర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇన్నాళ్ల శ్రియ కెరీర్ లో ఎఫైర్ ముచ్చట్లు ఇంత స్ట్రాంగ్ గా మరెప్పుడూ వినిపించలేదు. ఇన్నాళ్లు సినిమాతో బిజీగా గడిపిన శ్రియకి ఇప్పుడు బోలేడు ఖాళీ టైం దొరికింది. సినిమా అవకాశాలు తక్కడంతో ప్రేమ వ్యవహారాలని చక్కపెడుతోందంటూ కామెంట్లు వినబడుతున్నాయి. మరి.. కామెంట్స్ లో నిజమెంత అనేది.. తెలియాలంటే శ్రియ నోరు విప్పాల్సిందే.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శ్రియ బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బిజీగా ఉంది. దీంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ‘ఖైదీ నెం. 150’లోనూ శ్రియ ఓ కీలక పాత్రలోమెరవనున్నట్టు తెలుస్తోంది. ఒకే టైం టాలీవుడ్ లోని రెండు క్రేజీ ప్రాజెక్టులతో నటిస్తోంది ముద్దుగుమ్మ.

SHARE