ఎంసెట్ 3 షెడ్యూల్ రెడీ

  eamcet 3 shedule ready

ఈ నెల 8న ఎంసెట్-3 షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య ప్రకటించారు. హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి జేఎన్‌టీయూలో స‌మావేశ‌మైన ఎంసెట్‌-3 క‌మిటీ, ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ అంశాల‌ను చ‌ర్చించి ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకుంది. ఎంసెట్-3పై జేఎన్టీయూలో సమావేశమైన నిర్వహణ కమిటీ పలు అంశాలపై చర్చించింది. అనంతరం యాదయ్య మీడియాతో మాట్లాడుతూ.. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్-3 వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తామన్నారు.

8న షెడ్యూల్ విడుదల చేస్తాం.. వచ్చే నెల 3 నుంచి కొత్త హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ నంబర్, పరీక్షా కేంద్రాలు మారుతాయని స్పష్టం చేశారు. ఎంసెట్-2కు దరఖాస్తు చేసినవారికే ఎంసెట్-3లో అవకాశం ఉంటుందన్నారు. వచ్చే నెల 11న పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు.

రెండు, మూడు రోజుల్లో ఎంసెట్‌-3 వెబ్‌సైట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. కొత్త హాల్‌టికెట్లను వ‌చ్చేనెల 3 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఎంసెట్-2 ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన నేప‌థ్యంలో ఎంసెట్-3ని సెప్టెంబర్ 11న నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో ఇప్పటివరకూ 34మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది.

SHARE