పదహారేళ్ల వయస్సులో పన్ను వూడిపోయినా..ప్రమాదంలో చెవిని కోల్పోయినా…మనసులో ఎక్కడో చెలరేగే బాధ చెప్పలేనిది. ఎందుకంటే చిన్న వయస్సులో వూడిపోయినా పన్ను మళ్లీ రాదు. ఇలాంటి వారు ఇక ఏ మాత్రం చింతాంచాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు.
ఎవరికి తగినట్టు వారికి సరిగ్గా అమరిపోయే పళ్లు, చెవులు, ఇతర అవయవాలను త్రీడీ ప్రింటింగ్ పరిజ్ఞానం ద్వారా రూపొందించి అమర్చే వైద్య పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చేస్తోంది. మనదేశంలో చెన్నైలోని సెంటర్ ఫర్ టెక్నాలజీస్ అసిస్టెడ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఇందుకు కృషి చేస్తోంది. ఇటీవల కొందరికి త్రీడీ పళ్లను అమర్చింది. ప్రమాదంలో చెవులను కోల్పోయినవారికి చెవులను రూపొందించే పనిలో ఉంది.
బెంగళూరుకు చెందిన పన్డోరమ్ టెక్నాలజీస్, ముంబాయికి చెందిన ఆంటెమిజ్3డి-ఎల్ఎల్పీ సంస్థలూ వీటి తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ అవయవాలు ప్రాథమికంగా పొలిజెట్ ప్లాస్టిక్‌తో తయారవుతాయి. తర్వాత వాటిపై టైటానియం తదితర ఖనిజాలను ఉపయోగించి మరోదశ ముద్రణ జరుగుతుంది.
చివరిగా సహజ అవయవాలను పోలినట్టు కనిపించే బయోప్రింటింగ్ ఉంటుంది. మరోవైపు రోగుల నుంచి సేకరించిన జీవకణాలను..హెడ్రోజెల్తో కూడిన వాతావరణంలో ఉంచుతారు. అక్కడ కణజాలం పెరిగే వాతావరణం ఉంటుంది. వాటిని బయోరియాక్టర్స్లో ఉంచి, త్రీడీ పరిజ్ఞానంతో కాలేయం రూపకల్పనకు కృషి జరుగతోంది అని నిపుణులు వివరిస్తున్నాయి. త్రీడీ అవయవాల రూపకల్పన, తయారీకి కొన్ని రోజులుగా చాలట. ఖర్చు కూడా వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇది జరిగితే చాలా మంది అవయవ బాధలు తగ్గుతాయి.